English | Telugu
జక్కన్నా టూ మచ్!
Updated : Jul 11, 2015
సినీ ప్రియులు ఎదురు చూసి చూసి విసిగిపోయి....జక్కన్నా నీకో నమస్కారం అన్న తర్వాత కానీ బాహుబలి థియేటర్లోకి రాలేదు. తిండినిద్రా మానేసి రాత్రి పగలు థియేటర్ల దగ్గర కొట్టుకుని మరీ టిక్కెట్లు సంపాదించుకుని మొదటిరోజు సినిమా చూశారు. బాహుబలి సందడి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందిలెండి కానీ.....సెకెండ్ పార్ట్ సంగతేంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
మూడున్నరేళ్లు టైమ్ తీసుకున్నాడు కదా రెండు పార్టులు పూర్తచేసేశాడు....ఒకదాని తర్వాత మరొకటి విడుదలైపోతాయి అనుకున్నారంతా. కానీ రాజమౌళి పెద్ద ఝలక్ ఇచ్చాడు. పార్ట్ 2 కి మరో ఏడాది పడుతుందన్నాడు. అక్కడితే ఆగలేదు ఫస్ట్ పార్ట్ పై వచ్చిన విమర్శలు సెకెండ్ పార్ట్ లో రాకుండా జాగ్రత్తలు పడతాడట. సో లేట్ గా వచ్చినా మళ్లీ లేటెస్ట్ గా వస్తానంటున్నాడు.
అది సరే కానీ బాహుబలి సీక్వెల్ వచ్చేసరికి.....ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్రేక్షకులు మరిచిపోతారేమో? సంవత్సరం మాట పక్కనపెట్టి కనీసం ఆరునెలల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటే మంచిదంటున్నారు. ఓసారి ఆలోచించు జక్కన్నా!