English | Telugu

నయనతార రాణి పాటలు విడుదల

ఆర్య, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం "రాజా రాణి". ఈ చిత్రం ఇటీవలే తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్ర తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అట్లీ, హీరో ఆర్య, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ విచ్చేశారు. తొలి సీడీని నటుడు రానా విడుదల చేసి దర్శకుడు శ్రీవాస్ కు అందజేసారు. మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.