English | Telugu
ఫస్ట్ హాఫ్ అలా, సెకండ్ హాఫ్ ఇలా.. పుష్ప-2 ఎలా ఉందంటే..?
Updated : Dec 4, 2024
ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 పండుగ మొదలైంది. డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు కూడా పూర్తయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ లభిస్తోంది. (Pushpa 2 The Rule)
అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ మెచ్చేలా డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని మలిచాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెబుతున్నారు. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ అదిరిపోయాయట. ఫస్ట్ హాఫ్ ని ఎక్కువగా డ్రామాతో నడిపించిన సుకుమార్.. సెకండ్ హాఫ్ ని మాత్రం అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో నడిపించాడని అంటున్నారు. ముఖ్యంగా 20 నిమిషాల జాతర ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని, ఇది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిందని టాక్. అయితే పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ పీక్స్ అని, మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో బన్నీ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో పీలింగ్స్ సాంగ్, సెకండ్ హాఫ్ లో కిస్సిక్ సాంగ్ ఒక ఊపు ఊపాయట. మొత్తానికి ఇది ఫ్యాన్స్ ని, మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని.. లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన హిట్ మాస్ బొమ్మ అని టాక్ వస్తోంది.