English | Telugu

అల్లు అర్జున్ ఓన్ రిలీజ్ చేస్తున్నాడా!

ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. సినిమా ఒక మాదిరిగా ఉన్నా కూడా వందల కోట్లు వసూళ్లని అవలీలగా సాధిస్తున్నారు. అలా సాధించే హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు.వ్యాపార ప్రకటనల్లో కూడా నటిస్తూ క్రేజ్ తో పాటు క్యాష్ ని  సంపాదిస్తున్నాడు.లేటెస్ట్ గా ఆయనకీ సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా నిలిచింది.  

బన్నీప్రస్తుతం పుష్ప 2  షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్  వచ్చాడు.కాకపోతే బన్నీ కి వైజాగ్  షూటింగ్ లో గాయాలయ్యాయని అందుకే వెనక్కి వచ్చారనే రూమర్ కూడా ఉంది. ఆ సంగతి ఎలా ఉన్నా కూడా లేటెస్ట్ గా ఇంకో న్యూస్ వైరల్ గా మారింది. పుష్ప 2  ఓవర్సీస్ హక్కులని బన్నీ పొందాడని   తన ఏఏ సినిమాస్   ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నాడనే వార్త లు వస్తున్నాయి. ఈ విషయంపై పూర్తి  క్లారిటీ అయితే  రావాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్  అత్యంత భారీ వ్యయంతో పుష్ప 2 ని నిర్మిస్తుంది. పుష్ప 1 కి కూడా ఆ బ్యానర్ పైనే నిర్మాణం జరుపుకుంది. రష్మిక మందన్న, ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అనసూయ, జగపతిబాబు, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.పార్ట్ 1 లోని పాటలు ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపాయి.దీంతో 2 లో పాటలు ఎలా ఉండబోతాయో అనే ఆసక్తి అందరిలోను ఉంది.ఆగష్టు 15న మూవీ విడుదల కానుంది.