English | Telugu
హిందీలో పుష్ప 2 ఫస్ట్ డే సంచలన రికార్డు..షారుక్ రికార్డు గల్లంతు
Updated : Dec 6, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)పాన్ ఇండియా మూవీ పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హిందీలో కూడా అత్యధిక థియేటర్స్ లో విడుదలైన పుష్ప తొలి రోజు హిందీలో రికార్డు కలెక్షన్స్ ని రాబట్టింది.
ఫస్ట్ డే అరవై ఏడు కోట్ల రూపాయలని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. పుష్ప రాక ముందు వరకు ఈ రికార్డు షారుక్ నటించిన 'జవాన్' మూవీ మీద ఉండేది. జవాన్ తొలి రోజు అరవై ఐదు కోట్లని సాధించి,హిందీలో అప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన మూవీగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జవాన్(jawan)రికార్డుని పుష్ప అధిగమించింది.ఒక సౌత్ ఇండియా హీరో హిందీ బెల్ట్ లో రికార్డు సృష్టించడం అంటే పుష్ప మానియా ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ బీహార్ లోని పాట్నా లో జరిగిన విషయం తెలిసిందే.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొదటి రోజు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలని సాధించిన పుష్ప 2 ఇండియా వైడ్ గా చూసుకుంటే తెలుగులో తొంబై ఐదు కోట్ల పది లక్షలు,హిందీలో అరవై ఏడు కోట్లు, తమిళంలో ఏడు కోట్లు,కన్నడలో ఒక కోటి,మలయాళంలో ఐదు కోట్లుతో మొత్తం నూటడెబ్భైఐదు కోట్ల పదిలక్షల రికార్డు కలెక్షన్స్ ని సాధించింది.నెట్ కలెక్షన్స్ వారీగా చూసుకుంటే పుష్ప 2 160 కోట్లని సాధించగా ఆర్ ఆర్ ఆర్ నూటముప్పై మూడు కోట్లు, బాహుబలి 2 నూటఇరవై ఒక్క కోట్లు,కేజీఎఫ్ 2 నూటపదహారు కోట్లుతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.