English | Telugu

ప్ర‌భాస్‌.. రూ.150 కోట్లు కొట్టేస్తాడా??

తెలుగు సినిమా మార్కెట్ ఎంతో చాటి చెప్పిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. మ‌గ‌ధీర సినిమాతో బాలీవుడ్ కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. ఓ ప్రాంతీయ చిత్రం రూ.100 కోట్ల ద‌రిదాపుల్లోకి రావ‌డం.. విస్మ‌యప‌రిచింది. ఆ న‌మ్మ‌కంతోనే బాహుబ‌లికి రూ.250 కోట్ల‌కుపైనే ఖర్చు పెట్టేశాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి బ‌డ్జెట్ రెండొంద‌ల యాభై కోట్లు అన‌గానే... మ‌ళ్లీ జ‌నాల‌కు షాక్ తగిలింది. తెలుగు సినిమా స్టామినా ఇప్ప‌టి వ‌ర‌కూ వంద కోట్లే. ఎంత రెండు భాగాలు గా తెర‌కెక్కించినా బాహుబ‌లి సేఫ్ జోన్‌లోకి వెళ్ల‌డం క‌ష్ట‌మ‌నుకొన్నారంతా! అయితే ఆ లెక్క‌ల్ని బాహుబ‌లి ప‌టాపంచ‌లు చేసింది.

తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల వ‌ర‌కూ షేర్ సాధించి.... త‌న స‌త్తా చాటింది. ఈ రోజు మ‌రో నాలుగు రోజులు కొన‌సాగితే.... వంద కోట్ల‌మైలు రాయిని అందుకోవ‌డం త‌థ్యం. వంద స‌రే.. ఇంత‌కీ బాహుబ‌లి పార్ట్ 1 టార్గెట్ ఎంత‌? ఈ సినిమా ఎంత వ‌సూలు చేయ‌గ‌ల‌దు? అనే లెక్క‌లు వేస్తే.. అన్నీ అనుకూలిస్తే.. ఈ జోరు కొన్ని రోజులు ఇలానే కొన‌సాగితే... ఖ‌చ్చితంగా రూ.150 కోట్లు ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బాలీవుడ్‌లో బాహుబలి అడుగుపెట్ట‌డం, ప్ర‌పంచ వ్యాప్తంగా 4000 థియేట‌ర్ల‌లో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శితం కావ‌డంతో... ఈస్థాయి వ‌సూళ్లు ద‌క్కించుకొనే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు తేల్చి చెబుతున్నారు. అదే నిజ‌మైతే రాజ‌మౌళి అనుకొన్న‌ది సాధించిన‌ట్టే. టాక్ ఎలా ఉన్నా..టేకింగ్ మామూలుగానే ఉన్నా.. వ‌సూళ్లు మాత్రం ఇర‌గ‌దీస్తుండ‌డంతో బాహుబ‌లి టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. బాహుబ‌లి రూ.150 కోట్లు దాటితే... టాలీవుడ్ కూడా హ్యాపీనే. ఆల్ ది బెస్ట్‌.. బాహుబ‌లి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.