English | Telugu

జూలై 25 నుండి పవన్ గబ్బర్ సింగ్ షూటింగ్

జూలై 25 నుండి పవన్ "గబ్బర్ సింగ్" షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రవితేజ హీరోగా "షాక్, మిరపకాయ్" సినిమాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి మాతృక హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా "దబాంగ్" సినిమా అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా ఎవరెవరినో హీరోయిన్లుగా అనుకున్నా చివరికి పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించే అదృష్టం శృతి హాసన్ కి దక్కిందని తెలిసింది. జూలై 25 నుండి పవన్ "గబ్బర్ సింగ్" షూటింగ్ ప్రారంభమవుతుందనీ, ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించి, ఆగస్ట్ నుండి హీరో పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని తెలిసింది. ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమా తమిళంలో కూడా శింబు, రీచా గంగోపాథ్యాయ జంటగా రీమేక్ చేయబడుతూంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.