English | Telugu

"పైసా" పరిస్థితేంటి?

ఏ ముహూర్తాన ఆ సినిమాకు "పైసా" అనే టైటిల్ ఫిక్స్ చేసారో కానీ.. షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి.. ఆ చిత్రం పైసల సమస్య ఎదుర్కొంటూనే ఉంది. పైసా మహత్యం తెలపడం కోసం తీస్తున్న ఆ సినిమా.. నిర్మాతకు అనుక్షణం పైసా మహత్తు తెలుపుతూనే ఉంది. "పైసా" చిత్ర కథానాయకుడు నాని ఫుల్ ఫామ్‌లో ఉన్నా కూడా విడుదలపరంగా ఆ చిత్రం పలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా రమేష్‌పుప్పాల నిర్మిస్తున్న "పైసా" ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పతిస్థితుల్లో ఉంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అండదండలతో రమేష్‌పుప్పాల "ఎల్లో ఫ్లవర్స్" అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.. "మిరపకాయ్", "శ్రీమన్నారాయణ" చిత్రాలను నిర్మించారు. "మిరపకాయ్" మంచి విజయం సాధించగా.. "శ్రీమన్నారాయణ" సోసోగా ఆడింది. అయితే అనంతరకాలంలో.. "ఆర్.ఆర్ మూవీమేకర్స్" అప్పులపాలవ్వడంతో.. ఆ ప్రభావం "ఎల్లో ఫ్లవర్స్"పై పడింది. అందుకే.. హీరోగా నాని ఫుల్‌ఫామ్‌లో ఉన్నా కూడా "పైసా" చిత్రం విడుదలపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.