English | Telugu

రామ్‌గోపాల్‌ వర్మ ''ఒక ప్రేమ కథ''

అప్పుడప్పుడు మనం ఒళ్ళు గగుర్పొడిచే కొన్ని భయంకరమైన నేరాల గురించి వింటుంటాం. వాటిల్లో నన్ను అత్యంత షాక్‌ కి గురి చేసిన సంఘటన మార్స్‌ 7వ తేదీ 2008న ముంబయిలో మారియా సుసైరాజ్‌ అనే ఒక అమ్మాయి, తన ప్రియుడితో కలిసి ఒక వ్యక్తిని చంపి, శవాన్ని ముక్కలుముక్కలుగా చేసి, కిరోసిన్‌తో తగలపెట్టి శివార్ల బైట పడేసిన కేసు. నా తదుపరి సినిమా ఆ సంచలన హత్యకు దారితీసిన మారియా సుసైరాజ్‌ కథను ఆధారంగా చేసుకుని హిందీలోనూ, తెలుగులోనూ తెరకెక్కించబోతున్నాను.

 

 

 

ఒక అమ్మాయి, తన ప్రియుడు కలిసి ఒక వ్యక్తిని, ఒక సందర్భంలో, ఒక అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని ఎవరూ చూడకుండా కింద పార్కింక్‌ ప్లేస్‌లో ఉన్న తమ కార్లోకి తీసుకెళ్లటమెలా? అన్న సంధిగ్దంలోంచి వాళ్లకొచ్చిన ఒక ఆలోచన ఆ శవాన్ని చిన్నది చేయటం. చిన్నది చెయ్యటమెలా అన్న సంధిగ్దంలోంచి వాళ్లకు వచ్చిన ఆలోచన ఆ శవాన్ని ముక్కలు చెయ్యటం. మారియా సుసైరాజ్‌ పాత్రకు నటి మహీగిల్‌ను ఎంపిక చేయడం జరిగింది. మిగిలిన ముఖ్యమైన పాత్రల ఎంపిక జరుగుతోంది. నా జీవితంలో నేను ఇంతవరకూ విన్నటువంటి అతి భయంకరమైన హత్యోదాంతాల్లో ఈ హత్యది మొదటి స్థానం. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలకై నేను వాళ్ళ స్నేహితులు, బంధువులు, పోలీసులు, ఇన్వెస్టిగేటర్స్‌, లాయర్లు మొదలగు వారిని ప్రత్యక్షంగా కలిసి, మాట్లాడిన తర్వాత నేను షాకింగ్‌గా తెలుసుకున్నదేంటంటే ఈ మహాఘోరమైన హత్యాగాధ వెనుక నమ్మసక్యం కానటువంటి ''ఒక ప్రేమ కథ'' ఉందని.

 

  • ఆ ఇద్దరినీ హత్యకు ప్రేరేపించింది ప్రేమ
  • శవాన్ని ముక్కలు ముక్కలు చేయించినది ప్రేమ
  • వాళ్లని నరరూప రాక్షసులుగా మార్చింది ప్రేమ
  • అందుకే మారియా సుసైరాజ్‌ కేసు ఆధారంగా తీయబోయే నా సినిమాకు టెటిల్‌ ''ఒక ప్రేమ కథ'' అని పెడుతున్నాను.
  • "ఒక ప్రేమ కథ''
  • ఈ ప్రేమ కథ హృదయంలో నుంచి వచ్చింది, కానీ బలహీన హృదయాలు చూడతగనిది.

రామ్‌గోపాల్‌ వర్మ