English | Telugu

రాజకీయరంగ ప్రవేశంపై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..అభిమానులు గెట్ రెడీ 

మాన్ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్(ntr)ఈ నెల 27 న పాన్ ఇండియా లెవల్లో  దేవర గా అడుగుపెట్టి రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తున్నాడు. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టి తన  కట్ అవుట్ కి ఉన్నా స్టామినాని మరోసారి చాటి చెప్తున్నాడు.రానున్న రోజుల్లో దేవర బాక్స్ ఆఫీస్ వద్ద మరింతగా తన  ఆధిపత్యాన్ని చెలాయించడం ఖాయమని అభిమానులతో పాటు  సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  దేవర(devara)సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్  రాజకీయాల గురించి మాట్లాడటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతు రాజకీయాల కంటే కూడా నటనకే నా తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా  నటుడ్ని కావాలనే లక్ష్యాన్నే ఎందుకొని, పదిహేడేళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశాను.  అప్పటి నుంచి కేవలం నటనపైనే ఫోకస్ చేశాను. రాజకీయాల్లో పడే  ఓట్ల సంగతి పక్కన పెడితే, తన కోసం లక్షలాది మంది  టికెట్లు కొని సినిమా చూస్తున్నారు. ఆ విధంగా ఎంతో మంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

 2009 వ సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన  సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ తనతాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరుపున రెండు తెలుగు రాష్ట్రాల్లో విసృతంగా ప్రచారం చేసాడు.పార్టీ ఏర్పాటు చేసిన ఆయా సభల్లో చేసిన ఎన్టీఆర్ స్పీచ్ లు అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాకపోతే ఆ తర్వాత నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ చేసాడు. డై హార్డ్  ఫ్యాన్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.