English | Telugu

ఉదయనిధి స్టాలిన్ అయినా సరే మసాలా మాత్రం నో 

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలని పోషించుకుంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న నటి నిత్య మీనన్.  అలా మొదలయ్యింది, ఇష్క్, గుండెజారి గల్లంతయింది,మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల చిత్రాల్లో కూడా నటిస్తూ అశేష ప్రేక్షకాభిమాన్ని పొందింది.

నిత్య మీనన్ రీసెంట్ గా తిరు సినిమాకి గాను జాతీయ ఉత్తమనటి అవార్డుని అందుకుంది.ఈ సందర్భంగా  జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు తిరు లోని పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు.కెరీర్ ప్రారంభం నుంచి కూడా ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని అనుకోలేదు.నేను ఎంచుకున్న రంగం అలాంటిది మరి.పోషించిన పాత్ర నా  మనసుకు నచ్చితే చాలానే సినిమాలు చేస్తూ వస్తున్నా.భారీ బడ్జట్ తో  తెరకెక్కించే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నో చెప్పేస్తా. అలాంటి క్యారక్టర్ లంటే నాకు ఆసక్తి ఉండదు.క్యారక్టర్ నచ్చితే చిన్న సినిమా అయినా కూడా అంగీకరించి షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తుంటాను.అందరు అనుకరిస్తున్న మార్గంలో వెళ్లాలనే రూల్ లేదు కదా అని చెప్పుకొచ్చింది.

నిత్య మీనన్ ప్రస్తుతం జయం రవి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న కడలిక్క నిరమ్లలై అనే మూవీ చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాత కాగా ఆయన భార్య కిరుతిగ దర్శకత్వం వహిస్తుంది. ధనుష్ తో ఇడ్లి కడై అనే మూవీ కూడా చెయ్యబోతుండగా త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది.