English | Telugu

నా కష్టాలు తీరాయి - నయన తార

నా కష్టాలు తీరాయి అని 9 తార అంటుంది. వివరాల్లోకి వెళితే పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవాని ప్రేమించి అతనితో వివాహానికి సిద్ధపడి, అతని భార్యకు అతనితో విడాకులిప్పించింది ప్రముఖ హీరోయిన్ నయనతార. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ ప్రభుదేవాతో విడిపోయింది. దాని గురించి మాట్లాడుతూ "నా కష్టకాలం అంతా అయిపోయింది. నా కష్టాలన్నీ తీరాయి. ఈ సమయంలో నేను సినిమాలకు బాగా దూరమయ్యాను. అందుకని నేను నా సినీ కెరీర్ మీదే దృష్టి పెడదామనుకుంటున్నాను" అని అంది నయనతార.

నయనతార ప్రస్తుతం కామాక్షీ కళా మూవీస్ వారు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నిర్మించబోతున్న సినిమాలో నయనతార హీరోయిన్‍ గా నటించటానికి అంగీకరించింది. ఈ చిత్రం అమెరికా, హైదరాబాద్ లలో చిత్రీకరిస్తారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.