English | Telugu

నాగార్జున 100 వ చిత్రంలో చిరంజీవి? చిరంజీవి క్యారక్టర్ ఇదేనా!

సుదీర్ఘ కాలంగా అభిమానులని,ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తు ఒక హీరో వంద చిత్రాలు పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని కనపరుస్తూ,
కొత్తదనంతో కూడిన కథల్లో నటించడమంటే కత్తి మీద సామే. ఈ విషయంలో తన మార్క్ హీరోయిజాన్ని ప్రదర్శించే వాళ్ళల్లో 'కింగ్ నాగార్జున'(Nagarjuna)ఒకరు. సోలో హీరోగా సత్తా చాటుతునే , ఎలాంటి బేషజాలకి పోకుండా,ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించి, తన హవా చాటడం 'నాగార్జున'కి మాత్రమే సాధ్యమయ్యే స్టైల్.

నాగార్జున హీరోగా 'నా సామిరంగ' తో తొంబై తమ్మిది చిత్రాలని పూర్తి చేసాడు. దీంతో నాగార్జున వందవ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి, అభిమానులతో పాటు ప్రేక్షకులో ఉంది. అందుకు తగ్గట్టే నాగార్జున వందవ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళ దర్శకుడు 'కార్తీక్' దర్శకత్వం వహిస్తున్నాడు. రెగ్యులర్ కధాంశంతో కాకుండా, పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో చిరంజీవి ఎలాంటి రోల్ లో కనిపిస్తాడు, నాగార్జున, చిరంజీవి స్క్రీన్ ఫెయిర్ ఎలా ఉండబోతుందనే చర్చ ఇద్దరి అభిమానుల్లో జరుగుతుంది. ఈ రూమర్ నిజం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. చిరంజీవి, నాగార్జున మంచి మిత్రులతో పాటు చిరంజీవిని నాగార్జున అన్నయ్య అని పిలుస్తాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన 'కుబేర' ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున హీరోగానే కాకుండా ప్రేక్షకుల మనస్సులో చిరకాలం నిలిచిపోయే వైవిద్యమైన పాత్రలని చేస్తున్నాడు.

ఈ విషయంలో నాగార్జున ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను కూడా అలాంటి పాత్రలు చెయ్యడానికి రెడీ అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నాగార్జున వందవ చిత్రంలో చిరంజీవి కనపడ్డాఆశ్చర్యపోవాల్సిన పని లేదని, స్క్రీన్ పై కూడా నాగార్జునకి ఫ్రెండ్ క్యారక్టర్ లో కనిపించవచ్చనే మాటలు వినపడుతున్నాయి. నాగ చైతన్య(Nagachaitanya),అఖిల్(Akhil)కూడా కనిపించబోతున్నారని తెలుస్తుంది. విజయదశమి(Vijaya Dasami)కానుకగా ఈ చిత్రం ప్రారంభమవుతుందని టాక్ . చిరంజీవి గతంలో మహా నటుడు 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారితో కలిసి 'మెకానిక్ అల్లుడు' చేసిన విషయం తెలిసిందే.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.