English | Telugu

'ఆదిపురుష్' ఈవెంట్ లో జన ప్రభంజనం.. లక్షమంది పైనే!

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. టీ సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షమందికి పైగా ఈ వేడుకకు హాజరయ్యారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్ కెపాసిటీకి మించి 60 వేల మందికి పైగా గ్రౌండ్ లోపలికి అనుమతించగా, గ్రౌండ్ వెలుపల దాదాపు 50 వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక మంది హాజరైన వేడుకల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అంటున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.