English | Telugu

మనీషాకు సీరియస్

బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా అస్వస్తతకు గురై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నేపాల్ రాజ కుటుంబానికి చెందినా మనీషా 1989లో సౌదగర్ చిత్రం తో హిందీ పరిశ్రమలో అరంగేట్రం చేసింది . రజనీకాంత్, కమల్ హసన్ , షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి ఎందరినో అలరించింది. అయితే మనీషా అస్వస్తతకు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు, ఆమెకు చికిత్స చేస్తున్న వైద్య్వలు మాత్రం రిపోర్ట్స్ వచ్చేవరకు ఏ విషయం చెప్పలేము అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.