English | Telugu

"బిజినెస్ మ్యాన్" మూడు రోజుల కలెక్షన్స్

"బిజినెస్ మ్యాన్" తొలి మూడు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మించిన చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలైన తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. పదహారు వందల ప్రింట్లతో, రెండువేల స్క్రీన్లలో ప్రదర్శించబడిన ఈ చిత్రం 81 సంవత్సరాల తెలుగు బాక్సాఫీస్ రికార్డుల్ని ఈ చిత్రం తిరగరాసింది. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం తొలి మూడు రోజుల్లో గ్రాస్ 38, 16, 00, 000 రూపాయలు వసూలు చేయగా, షేర్ 27, 35, 00, 000 రూపాయలు వసూలు చేసింది

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.