English | Telugu

ప్రిన్స్ జాయ్ అలూకాస్ యాడ్ కి త్రివిక్రమ్ దర్శకత్వం

ప్రిన్స్ "జాయ్ అలూకాస్" యాడ్ కి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారట. వివరాల్లోకి వెళితే ఈ మధ్య అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారట. అదే "జాయ్ అలూకాస్" అనే జ్యూయలరీ కంపెనీ. అంటే బంగారు నగల కంపెనీ అన్నమాట. ఈ జాయ్ అలూకాస్ కంపెనీ కోసం ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే ఎడ్వర్టైజ్ కు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.

యంగ్ టైగర్ యన్ టి ఆర్ "మలబార్ గోల్డ్"కంపెనీకి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున "కళ్యాణ్ జ్యూయలరీకి" బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉంటే ఇప్పుడు వారికి పోటీగా ప్రిన్స్ మహేష్ బాబు "జాయ్ అలూకాస్" అనే జ్యూయలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారన్నమాట. మన హీరోలు సినిమాల్లోనే అనుకుంటే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పోటీపడుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.