English | Telugu

నవంబర్ లో మహేష్ ఆగడు

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘దూకుడు' తర్వాత తెరకెక్కనున్న రెండో చిత్రం"ఆగడు". ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరులో ముహూర్తం షాట్‌తో స్టార్ట్ కానుంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే పక్కాగా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన శ్రీను వైట్ల త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఎలాగైనా ఈ చిత్రాన్ని "దూకుడు" కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టయ్యే సాంగ్స్ ఇవ్వాలని థమన్ ఆశిస్తున్నాడు.

మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.