English | Telugu

‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?

బాహుబలి సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో, అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దాని రన్ టైమ్ కూడా ఎంతనో చెప్పేశారు. అయితే ఇలా రెండు పార్టులను ఒకే సినిమాగా విడుదల చేయాలని బాహుబలి టీమ్ కి ఆలోచన ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ.. ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ఈ ఐడియా ఇవ్వడం విశేషం. (Baahubali: The Epic)

అసలు విషయం ఏంటంటే... బాహుబలి-2 (ఏప్రిల్ 28, 2017) విడుదలైన వారానికి లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. మే 6, 2017న ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే... "రాజమౌళి గారు... బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు" అని ట్వీట్ వేశారు.

ఎనిమిదేళ్ల క్రితమే ఇలా బాహుబలిని ఒకే సినిమాగా విడుదల చేయాలని ఐడియా ఇచ్చిన విక్రం నారాయణరావుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.