English | Telugu
Kishkindha Kandam Movie Review: ‘కిష్కింద కాండం’ మూవీ రివ్యూ
Updated : Nov 20, 2024
మూవీ : కిష్కింద కాండం
నటీనటులు: ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, విజయ్ రాఘవన్ణ జగదీష్, అశోకన్ తదితరులు
ఎడిటింగ్: సూరజ్ ఈఎస్
మ్యూజిక్: ముజీబ్ మజీద్
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ: బహుల్ రమేశ్
నిర్మాతలు: జాబీ జార్జ్ తడాథిల్
దర్శకత్వం: దింజిత్ అయ్యతన్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
అప్పు పిళ్ళై (విజయ్ రాఘవన్) మాజీ మిలటరీ అధికారి. అతని కొడుకు అజయ్ చంద్రన్(ఆసిఫ్ అలీ). అజయ్ చంద్రన్, అపర్ణ(అపర్ణ బాలమురళి) ఇద్దరు పెళ్ళి చేసుకుంటారు. ఇక ఎన్నికల సమయం కనుక వాళ్లు ఉండే ప్రాంతంలోని లైసెన్స్ రివాల్వర్, గన్ లని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ వారు నోటీసులు జారీ చేస్తారు. ఇక అదే సమయంలో అప్పు పిళ్లై దగ్గర ఉండే రివాల్వర్ కనపడకుండా పోతుంది. ఇక అదే విషయం గురించి పోలీసులు అప్పు పిళ్లై దగ్గరికి రాగా అతను చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతాడు. అది చూసి అందరు అతను మిలటరీ అధికారి కాబట్టి కోపం ఎక్కువ అనుకుంటారు. ఇక రివాల్వర్ కోసం పోలీసులు గాలిస్తుంటారు. కొత్తగా పెళ్ళి చేసుకొని ఇంటికి వచ్చిన అపర్ణకి అప్పు పిళ్లై బిహేవియర్ వింతగా అనిపిస్తుంది. దాంతో ఆమె అతడిని ఫాలో చేస్తుంది. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? అతని కొడుకు చాచు ఏమయ్యాడు? అప్పు పిళ్లై రివాల్వర్ లోని ఆ రెండు బుల్లెట్లు ఏమయ్యాయనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే ఒక పెళ్ళితో , మరోవైపు వాళ్ళ నాన్న రివాల్వర్ మిస్ అయిందనే ప్రాబ్లమ్ తో మొదలవుతుంది. దాంతో కథలోకి ఆడియన్ వెళ్ళిపోతాడి. అక్కడి నుండి చివరి వరకు ఆ రివాల్వర్ ఏం అయింది. అసలు అప్పు పిళ్ళై ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకోవాలనే ఇంటెన్స్ ని కలుగజేశాడు దర్శకుడు దింజిత్ అయ్యతన్. అయితే నిడవి కాస్త ఓపికకి పరీక్ష పెడుతుంది.
రెండు గంటల సినిమాలో చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే థ్రిల్ అండ్ ట్విస్ట్ ల కోసం గంట నలభై నిమిషాలు సినిమా చూడాలే అని కొందరికి అనిపిస్తుంది. అయితే మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇది ఒక ఢిఫరెంట్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. తాజాగా వచ్చిన ' 1000 Babies ' వెబ్ సిరీస్ లాగే ఇది అనిపిస్తుంది కానీ అందులో ఎక్కువ పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలో తక్కువ పాత్రలతో కథనే బలమైన వస్తువుగా మలిచాడు దర్శకుడు. అయితే స్లోగా సాగే ప్రథమార్థం విసుగు తెప్పిస్తుంది. ఎవరు ఊహించనివిధంగా వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాని ప్రధాన బలంగా నిలిచాయి.
ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అడల్ట్ సీన్లు లేవు, అశ్లీల పదాలు వాడలేదు. చివరి వరకు ఎంగేజింగ్ గా సాగుతుంది. మజీబ్ మజీద్ బిజిఎమ్ పర్వాలేదు. బహుల్ రమేశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సూరజ్ ఎడిటింగ్ లో కాస్త శ్రధ్ధ తోసుకొని ఫస్టాఫ్ లోని బోరింగ్ సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అపర్ణ పాత్రలో అపర్ణ బాలమురళి, అజయ్ చంద్రన్ గా ఆసిఫ్ అలీ, అప్పు పిళ్లై గా విజయ్ రాఘవన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : స్లోగా సాగే కథనంతో పాటు థ్రిల్ ని పంచే కిష్కింధ కాండమ్.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్