English | Telugu

Kill movie review: కిల్ మూవీ రివ్యూ

 

 

మూవీ : కిల్
నటీనటులు: లక్ష్య,రాఘవ్ జుయల్, తాన్య మనిక్తలా, ఆశిష్ విద్యార్థి,  హర్ష్ ఛాయ, అభిషేక్ చౌహాన్ తదితరులు
ఎడిటింగ్:  శివకుమార్ వి. పణికర్
మ్యూజిక్: విక్రమ్ మోన్ట్రొసె, షశ్వత్ సచ్ దేవ్
సినిమాటోగ్రఫీ: రఫీ మహమ్మద్
నిర్మాతలు: కరణ్ జోహార్, గుణీత్ మోంగా, అపూర్వ మెహతా
దర్శకత్వం: నిఖిల్ నఘేష్ భట్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:

ఈ కథ రాంచీలో మొదలవుతుంది. అమిత్ రాఠోడ్(లక్ష్య), తులికా(తాన్య మనక్తిలా) ఇద్దరు ప్రేమికులు. అమిత్ ఎన్ఎస్జీ కమాండో. తను ప్రేమించిన తులికాకి వాళ్ళ పేరెంట్స్ వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేద్దామని అనుకుంటారు. అయితే ఆ విషయాన్ని  తెలుసుకున్న అమిత్.. తను వెళ్తున్న ట్రైన్ లోనే ఎక్కుతాడు. ఆ ట్రైన్ రాంచీ నుండి ఢిల్లీకి వెళ్తుంటుంది. ఇంతలో అర్థరాత్రి అదే ట్రైన్ లో ఉన్న కొంతమంది బందిపోట్లు ప్యాసింజర్స్ మీద దాడి చేస్తుంటారు. కత్తులతో బెదిరిస్తు డబ్బులు, నగలు, ఫోన్లు ఇలా ఏది కుదిరితే అది దోచుకుంటారు. అయితే వీళ్ళ వల్ల తులికా మరియు ఆమె కుటుంబం చిక్కుల్లో పడుతుంది‌. మరి అదే ట్రైన్ లో ఉన్న అమిత్ తులికాను కాపాడాడా? బందీపోట్లని ఎలా ఎదుర్కున్నాడనేది మిగతా కథ.


విశ్లేషణ:

కథ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్  అన్నీ కుదిరిన సినిమా ఇది. గంట నలభై అయిదు నిమిషాల్లో దర్శకుడు తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. సినిమాలో ఎనభై శాతం యాక్షన్ అండ్ రక్తపాతమే ఉంటుంది. కానీ అది ఎందుకు అంతలా ఉందనే ఓసారి కథ చూస్తే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే సినిమా ఫస్టాఫ్ ముగిసాక చూసే ఆడియన్ ఇన్వాల్వ్ అయిపోయి చంపు.. చంపు అనేంతలా కథ సాగుతుంది.

కథతో పాటు సాగే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఇది చూస్తున్నంతసేపు వినోదం, పాటలు, అనేవి సినిమాకి అవసరమా అనే క్వశ్చన్ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఎక్కడా ఏదీ ఎక్కువ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఓ ట్రైన్ లో అంతలా ఫైట్ సీక్వెన్స్ ని ప్రెజెంట్ చేయడం బాగుంది. దీన్ని ఇలా మలిచిన విఎఫ్ఎక్స్ టీమ్ , ఫైట్ మాస్టర్, కెమెరామెన్ ని అభినందించాలి. 

ఇక హీరోయిన్ పాత్రకి కూడా ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా ఎంతవరకు ఉండాలో అంతే ఉంచేశారు. నిజానికి ఈ సినిమా తీసేటప్పుడు దర్శకుడు 'ల్యాగ్' అనే వర్డ్ ఉందనే విషయం మర్చిపోయి చేసినట్టున్నాడు. సినిమా అంతా కట్టె, కొట్టె, తెచ్చె అనేట్టుగా ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్తుంది. అయితే అది కూడా ఆడియన్ కి అర్థమయ్యేలా చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు మేకర్స్. కథలో కొత్తదనం, యాక్షన్ సీక్వెన్స్ లు గ్రిస్పింగ్ గా చూపించడం.. చివరి వరకు చూసేలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. కానీ రక్తపాతం కాస్త ఎక్కువ ఉంటుంది. అది ఒక్కటే ఒకే అయితే ఫ్యామిలీతో పాటు చూసేయొచ్చు. ఈ సినిమాలో ఒక్క సాంగ్ ఉంటుంది‌. అది బాగుంటుంది. హీరో, విలన్ కి మధ్య ఫైట్ లో బిజిఎమ్ ఇంకాస్త పడి ఉంటే ఇంకా బాగుండేది. రఫీ మహమ్మద్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అంతే. శివకుమార్ వి‌.  పణికుమార్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


నటీనటుల పనితీరు: 

లక్ష్యకి తొలి సినిమానే అయిన ఆకట్టుకున్నాడు. తాన్య మనిక్తలా అందంతో ఆకట్టుకుంది. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : ఈ కిల్ యాక్షన్ సినిమా ప్రియులకి ఫీస్ట్.. కామన్ ఆడియన్స్ కి వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ : 2.75 / 5 


✍️. దాసరి  మల్లేశ్