English | Telugu

దీపికకు ఎర్త్ పెట్టిన కంగన

కర్లీ హెయిర్ బ్యూటీ కంగనా రనౌట్ పొడుగుకాళ్ల సుందరి దీపికకు ఎర్త్ పెడుతుందా? బాలీవుడ్ లో నంబర్ ప్లేస్ న్ రీప్లేస్ చేస్తుందా? బీటౌన్ జనాలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. క్వీన్ తో సత్తాచాటుకున్న కంగనా....తను వెడ్స్ మనుతో పీక్స్ కి చేరింది. పైగా ఒక్క సినిమా హిట్టైతే పారితోషికం అమాంతంగా పెంచే బ్యూటీలున్న ఈరోజుల్లో ఓస్థాయికి చేరేవరకూ డబ్బుల ఊసెత్తలేదు.

ప్రస్తుతం అమ్మడు ఆరుకోట్లు డిమాండ్ చేస్తోందట. అంతకు పైసా తక్కువైనా కనీసం దగ్గరకు రావద్దని తేల్చిచెప్పిందట. పైగా బాలీవుడ్ లో టాప్ హీరోయన్ అనగానే అంతా కంగనా మాటే చెబుతున్నారట. దీంతో నిన్నటి వరకూ నంబర్ ప్లేస్ లో దుమ్ములేపిన దీపక సెకెండ్ ప్లేస్ కి వెళ్లిపోయిందని డిస్కస్ చేసుకుంటున్నారు.

తొలిచిత్రం నుంచి ఈ మధ్య విడుదలైన పీకూ వరకూ వందకోట్లకు తక్కువ కాకుండా వసూలు చేసిన దీపికకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది వరుస నాలుగు చిత్రాలతో కంగనా...దీపికను అధిగమించేసింది. దీంతో కంగన ది బెస్ట్ అంటున్నారంతా. మొత్తానికి దీపికకు ఎర్త్ పెట్టడం ఖాయం అని ఫిక్సైపోయారు. మరి దీపక ఫస్ట్ ప్లేస్ ను ఎలా కాపాడుకుంటుందో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.