English | Telugu
అలీ పై రకుల్ ప్రీత్ సింగ్ భర్త పోలీసు కేసు..రాజకీయ కోణం ఏమైనా ఉందా!
Updated : Sep 25, 2024
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh)కి కొన్ని నెలల క్రితం బాలీవుడ్ కి చెందిన జాకీ భగ్నానీ తో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ జాకీ భగ్నానీ ఎవరో కాదు హిందీ చిత్ర సీమలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన బడా నిర్మాత. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రఫ్ హీరోలుగా, మానుషీ చిల్లర్, అలయ ఎఫ్ హీరోయిన్ లుగా బడే మియా చోటే మియాన్ ని నిర్మించాడు.
ఈ సంవత్సరం ఏప్రిల్ పదకొండున విడుదలైన బడే మియా చోటే మియాన్(bade miyan chote miyan)బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది.అలీ అబ్బాస్ జాఫర్(ali abbas zafar)దర్శకత్వం వహించగా మూడువందల యాభై కోట్ల భారీ బడ్జట్ తో జాకీ భగ్నానీ మరికొంత మందితో కలిసి నిర్మించాడు.ఇప్పుడు అలీ అబ్బాస్ పై జాకీ భగ్నానీ పోలీసు కేసు పెట్టాడు.తొమ్మిదిన్నర కోట్ల రూపాయలని అలీ లెక్క చెప్పకుండా వాడుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో ఇప్పుడు ఈ విషయం ముంబై సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.రాజకీయ కోణం ఏమైనా ఉందనే అనుమానాలు కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇక బడే మియా చోటే మియాన్ కేవలం నూటరెండు కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో జాకీ దివాలా తీసాడనే వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి.ముంబై , స్కాట్ లాండ్, లండన్, లూటాన్, అబు దాబి, జోర్దాన్ వంటి భారీ లొకేషన్స్ లో ఈ మూవీ షూటింగ్ ని జరుపుకోగా సలార్ పృథ్వీ రాజ్ కుమార్, సోనాక్షి సిన్హా వంటి బిగ్ స్టార్స్ కూడా ముఖ్య పాత్రలో కనపడ్డారు.