English | Telugu

Ranabaali: విజయ్ 'రణబాలి' మూవీ.. ఆ నవలకు కాపీనా..?

'రణబాలి'గా విజయ్ దేవరకొండ
రాయలసీమ నేపథ్యంలో పీరియడ్ డ్రామా
'శప్తభూమి' నవల ఆధారంగా తెరకెక్కుతోందా?
గ్లింప్స్ విడుదలతో సోషల్ మీడియాలో కొత్త చర్చలు!

కొన్నేళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. 'రణబాలి' అనే ఒక విభిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'టాక్సీవాలా', 'శ్యామ్‌ సింగరాయ్' వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరుపొందిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామా.. 'శప్తభూమి' అనే నవలకు ఆధారంగా తెరకెక్కుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. (Ranabaali)

'రణబాలి' అనేది రాయలసీమ ప్రాంతంలో 19వ శతాబ్దంలో జరిగిన కథతో తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలన కాలంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతంలో.. ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుడు 'రణబాలి'గా విజయ్ కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ లో గుర్రంపై రౌద్ర రూపంలో విజయ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని 'శప్తభూమి' నవలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. (Saptha Bhoomi)

'శప్తభూమి' అనేది 2017లో ప్రచురితమైన తెలుగు చారిత్రిక నవల. 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ నవల 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందటం విశేషం.

రెండూ రాయలసీమ నేపథ్యం కావడం, 'శప్తభూమి' కవర్ ఫోటోని తలపించేలా 'రణబాలి' గ్లింప్స్ లో విజయ్ లుక్ ఉండటంతో.. ఆ నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'శప్తభూమి' అంటే శాపగ్రస్తమైన భూమి లేదా శపించబడ్డ నేల అని అర్థం. 'రణబాలి' పోస్టర్ లో 'The Legend of the Cursed Land' అని రాసి ఉంది. 'Cursed Land' అంటే శపించబడ్డ నేల అని అర్థం వస్తుంది. దాంతో ఆ నవల ఆధారంగానే 'రణబాలి' తెరకెక్కుతోందని బలంగా వినిపిస్తోంది.

అయితే, 'శప్తభూమి' 18వ శతాబ్దం నాటి కథ కాగా, 'రణబాలి' 19వ శతాబ్దపు కథ. అలాగే 'రణబాలి' గ్లింప్స్ ని గమనిస్తే ఇందులో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కథానాయకుడు గర్జించినట్లు కనిపిస్తోంది. 'శప్తభూమి'లో అటువంటి ప్రస్తావన ఉండదు.

మరి 'శప్తభూమి' నవలలోని కొన్ని అంశాలను ప్రేరణగా తీసుకొని 'రణబాలి'ని రూపొందిస్తున్నారా అనే దానిపై.. సినిమా విడుదల తర్వాత కానీ పూర్తి స్పష్టత వచ్చేలా లేదు.

కాగా, 'రణబాలి' సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: అఫీషియల్.. 'దేవర-2' షూటింగ్ కి ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే?

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.