English | Telugu
'ఎన్టీఆర్ 30' మళ్ళీ వెనక్కి!
Updated : Feb 5, 2023
'ఎన్టీఆర్ 30' మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించాడు. కానీ నెలలు గడుస్తున్నా సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఫిబ్రవరిలో మొదలుతుందని ఇటీవల అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి కూడా వచ్చేసింది కానీ ఇంతవరకు మూవీ లాంచ్ కి సంబంధించిన ఊసే లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం లేదని మార్చి మూడో వారంలో పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
'ఎన్టీఆర్ 30' షూటింగ్ మార్చి 20 నుంచి మొదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్, గోవా, వైజాగ్ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. నవంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ బిజీ కానున్నాడని సమాచారం. ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నాయట.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ కారణంగా వచ్చిన గ్యాప్ ని ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలు వేగంగా పూర్తి చేసి భర్తీ చేయాలని చూస్తున్నాడు. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ 30 మార్చిలోనైనా మొదలవుతుందా? మళ్ళీ ఏప్రిల్ కి వెళ్తుందా అని ఆందోళన చెందుతున్నారు.