English | Telugu

సంపూ వచ్చేసాడు

దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ ద్వారా బాగా పబ్లిసిటీ సంపాదించుకొని, బర్నింగ్ స్టార్ గా మారి, తన సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూసేలా చేసిన సంపూర్నేష్ బాబు నటించిన చిత్రం "హృదయ కాలేయం". సినిమా మొత్తం కూడా పిచ్చి కామెడి అనే విధంగా ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు చూస్తేనే అర్థమవుతుంది. స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మించారు. మోహన్ బాబు, వర్మల కాంబినేషన్ లో తెరకెక్కిన "రౌడీ" చిత్రానికి పోటీగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.