English | Telugu

గోపీచంద్‌ ‘జిల్‌’ టీజర్ అదిరింది

మిర్చిలో ప్రభాస్‌, రన్‌ రాజా రన్‌లో శర్వానంద్‌ స్టయిలిష్‌గా చూపించిన యు.వి. క్రియేషన్స్‌ మరో మాస్ హీరోని స్టైలిష్ హీరోగా మార్చేసింది. గోపీచంద్‌ని ఇప్పటికి వరకు అందరూ చాలా మాసిగా చూపించారే తప్ప స్టయిలిష్‌ యాంగిల్లో ఎవరూ చూపించడానికి ధైర్యం చేయలేదు. అయితే లేటెస్ట్ తెరకెక్కిన ‘జిల్‌’ చిత్రం గోపీని స్టయిలిష్‌ యాక్టర్ గా మార్చేశాడు కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. జిల్‌’ చిత్రం టీజర్‌లో స్టయిలిష్‌ గోపీతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రంలో గోపీచంద్‌ నుంచి కోరుకునే యాక్షన్‌తో పాటు వినోదానికి కూడా లోటుండదట.మార్చి 12న జిల్‌ ఆడియో రిలీజ్‌ చేసి, మార్చి 27న జిల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.