English | Telugu
జార్జియాలో `గౌతమిపుత్ర శాతకర్ణి` క్లైమాక్స్
Updated : Jul 2, 2016
నందమూరి బాలకృష్ణ చారిత్రాత్మక వందవ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది ఈ సందర్భంగా....
ఈ సందర్భంగా నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ ``జూలై 4 నుండి మా చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నాం. ఈ భారీ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయి. జార్జియాలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతం రష్యాకు చాలా దగ్గరగా ఉంటుంది. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరిస్తున్నాం. నందమూరి బాలకృష్ణగారు మరో రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటారు`` అన్నారు.
దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ ‘’మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. అక్కడ యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించాం. తర్వాత సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్ లో షూట్ చేశాం. ఇప్పుడు జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాం. అలాగే సినిమాకు సంబంధించిన సిజీ వర్క్ పనులు కూడా ప్రారంభమవుతాయి`` అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.