English | Telugu

'ఫంకీ' టీజర్.. మరో 'జాతిరత్నాలు' అవుతుందా?

హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ కె.వి. అనుదీప్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా 'ఫంకీ' చిత్రం నుండి టీజర్ విడుదలైంది. (Funky Teaser)

రెండు నిమిషాల లోపు నిడివితో రూపొందిన 'ఫంకీ' టీజర్ లో అనుదీప్ మార్క్ కామెడీ డైలాగ్స్ అడుగడుగునా ఉన్నాయి. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. "నేను ఇంతపెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టే, నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్ళా." అంటూ స్కూల్ ఈవెంట్ లో విశ్వక్ చెప్పడం నవ్వులు పూయించింది. అనుదీప్ మార్క్ ఫన్నీ డైలాగ్స్ తో విశ్వక్ కొత్తగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కయాదు లోహర్‌ కూడా ఆకట్టుకుంది. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి 'ఫంకీ' టీజర్ అనుదీప్ శైలి వినోదభరిత చిత్రానికి హామీ ఇచ్చింది.

అనుదీప్ దర్శకత్వం వహించిన 'జాతిరత్నాలు' ఏ స్థాయిలో నవ్వులను పంచిందో తెలిసిందే. ఆ తర్వాత అనుదీప్ నుంచి వచ్చిన 'ప్రిన్స్' బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు 'ఫంకీ'తో ఆ లోటుని తీర్చి, 'జాతిరత్నాలు' బాటలో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.