English | Telugu
Freedom at midnight series review: ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సిరీస్ రివ్యూ
Updated : Nov 26, 2024
సిరీస్ : ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్
నటీనటులు: సిద్దాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా , చిరాగ్ వోహ్రా, ల్యూక్ మెక్ గిబ్నీ, అరిఫ్ జాకారియా తదితరులు
ఎడిటింగ్: శ్వేతా వెంకట్
సినిమాటోగ్రఫీ: మలయ్ ప్రకాశ్
మ్యూజిక్: అషుతోష్ పాఠక్
నిర్మాతలు: మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ
దర్శకత్వం: నిఖిల్ అద్వానీ
ఓటీటీ: సోని లివ్
కథ:
1940-1946 కాలంలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే కీలకమైన నిర్ణయం తీసుకోడానికి రెండు పార్టీలు సమావేశం అవుతాయి. సిమ్లాలోని వైస్ రాయ్ వేవెల్ లో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అండ్ ముస్లిం లీగ్ చర్చల కోసం కలుస్తారు. రెండు పార్టీల నాయకులు ఒకే డెసిషన్ కి రావాలనుకుంటారు. ఆ మీటింగ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ , చాచా నెహ్రూ, మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా ముఖ్యమైన నాయకులుగా పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో గాంధీ తీసుకున్న నిర్ణయమేంటి? పాకిస్తాన్ విడిపోవడానికి కారణమేంటి? పంజాబ్ లోని జరిగిన అల్లర్ల వెనక గల కారణమేంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్ లతో సాగుతుంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా విడిపోతున్న సమయంలో నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ముగ్గురు ఏం చేశారు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్ ఏర్పాటుకి ఎంతమందిని హింసించాడనేది చూపిస్తూ ఈ సిరీస్ సాగుతుంది.
ఏడు ఎపిసోడ్ లు స్లోగా సాగే స్క్రీన్ ప్లేతో కాస్త ఇబ్బంది పెడతాయి. కానీ డైలాగ్స్ మెప్పిస్తాయి. ఇది ఓ నవల ఆధారంగా తీసిన సిరీస్ కాబట్టి అంతా కల్పితమే.. కానీ దేశ విభజన సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ, జిన్నా వీళ్ళంతా ఇలానే చేసి ఉంటారేమో అనే భావనని ప్రేక్షకుడిలో కల్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రధాన పాత్రల మేకప్ అంతగా సెట్ అవ్వలేదు.
గాంధీ , నెహ్రూ పాత్రలు చేసినవారి పర్ఫామెన్స్ అంతగా కనెక్ట్ కావు. స్వాతంత్ర్యం ముందు దేశంలో ఎన్ని దారుణాలు జరిగాయో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆయితే డీటేయిలింగ్ గా చూపించాలనుకున్న దర్శకుడు కథనాన్ని స్లోగా చూపించాడు. ఇది ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెడుతుంది. అడల్ట్ సీన్స్ లేవు. అసభ్య పదజాలం వాడలేదు. అహింసని పాటించే గాంధీకి స్వాతంత్ర్యం కోసం ఏం చేశాడనేది ఇందులో చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బిజిఎమ్ కొన్ని చోట్ల బాగుంది.వఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
జవహార్ లాల్ నెహ్రూగా సిద్దాంత్ గుప్తా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గా రాజేంద్ర చావ్లా, మహాత్మా గాంధీ పాత్రలో చిరాగ్ వోహ్రా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలు వారి పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా : కల్పిత కథతో హిస్టరీకీ ఫిక్షన్ యాడ్ చేస్తూ తీసిన ఈ సిరీస్ ని ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్