Read more!

English | Telugu

పాము విషంతో పార్టీ ఏర్పాటు చేశాను.. ఒప్పుకున్న బిగ్ బాస్ ఓటిటి విజేత  

గత ఏడాది నవంబర్ 3 న జరిగిన ఒక సంఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది. అసలు  ఇలాంటి పార్టీలు కూడా ఉంటాయా అని ఒక్కసారిగా అందరి ఒళ్ళు జలదరించింది. ఏదో రేవ్ పార్టీలంటే విచ్చలవిడి ఆల్కహాల్ తో  పాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని తెలుసు. ఇంకా చెప్పాలంటే డ్రగ్స్ కూడా వాడతారని కూడా తెలుసు.కానీ వామ్మో ఇదేం  రేవ్ పార్టీరా బాబు అని అందరు అనుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో జరిగిన అరెస్ట్ సంచలన వార్తగా మారింది.  

 2023 సంవత్సరానికి సంబంధించి  బిగ్ బాస్ ఓటిటి 2  విజేత గా ఎల్విష్ యాదవ్ నిలిచాడు. ఇతను ఒక ఫేమస్ ట్యూబర్ కూడా. గత ఏడాది నోయిడా లో కొంత మంది తో కలిసి రేవ్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీ లో మరింత కిక్కుతో ఎంజాయ్ చెయ్యడానికి  పాము విషాన్ని ఏర్పాటు చేసాడు.ఇందుకు సంబంధించి రక రకాల పాముల విషాలని తెప్పించాడు. ఈ క్రమంలో పక్కా  సమాచారం తో పోలీసులు రేవ్  పార్టీ పై దాడి జరిపి పలువురిని అరెస్ట్ చేసారు. కానీ ఆ సమయంలో  ఎల్విష్ మాత్రం తనకి ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పాడు. దీంతో ఎంక్వయిరీ చేసిన పోలీసులు పాముల విషం  ఎల్విష్  నే ఏర్పాటు చేసాడని నిర్దారణకు వచ్చారు. తాజాగా అరెస్ట్ చేసారు. కోర్టు లో కూడా హాజరుపడచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పుడు ఈ విషయం   దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

 తనపై వచ్చిన ఆరోపణలన్నీ  అబద్ధాలని అవి నిజాలని  నిరూపిస్తే బట్టలు ఊడదీసి డాన్స్ చేస్తానని ఎల్విష్ గతంలో  ప్రకటించాడు.ఇక ఎల్విష్ తన నేరాన్ని అంగీకరించినట్టుగా పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీ కి పాము విషాన్ని సరఫరా చేసిన వాళ్ళు తనకి తెలుసనీ అంగీకరిచినట్టుగా కూడా  సమాచారం.