English | Telugu

300 కోట్లు ఔట్.. రాబోయే పది రోజులు దేవర తాండవమే!

బాక్సాఫీస్ దగ్గర 'దేవర' (Devara) జోరు కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ, సెప్టెంబర్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ రాబట్టిన దేవర.. రెండో రోజు రూ.71 కోట్ల గ్రాస్ తో జోరు చూపించింది. ఇక మూడో రోజు కూడా రూ.71 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.304 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. (Devara Collections)

వరల్డ్ వైడ్ గా సుమారుగా రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర మూవీ.. బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అనిపించుకోవాలంటే రూ.360 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత జోరు చూస్తుంటే మొదటి వారంలోనే ఈ చిత్రం లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం థియేటర్లలో ఇతర పెద్ద సినిమాలు లేవు. దానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా, అక్టోబర్ 3 నుంచి పదిరోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. దాంతో ఈ రెండు రోజులు కాస్త కలెక్షన్లు తగ్గినా, అక్టోబర్ 2 నుంచి అదిరిపోయే కలెక్షన్లు వచ్చే అవకాశముంది. అదే జరిగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.