English | Telugu
ప్రభాస్ కల్కి రికార్డు ని గల్లంతు చేస్తున్న సినిమా ఇదే
Updated : Jul 24, 2024
ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడు గర్వపడే హీరో ప్రభాస్(prabhas).తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టిస్తు తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. గత నెల జూన్ 27 న కల్కి 2898 ఏడి(kalki 2898 ad) తో ల్యాండ్ అయ్యి ఆల్ ఏరియాస్ రికార్డుల మోత మోగించాడు. వెయ్యి కోట్ల కలెక్షన్ క్లబ్ లో కూడా చేరాడు. అయితే ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించి కల్కి రికార్డు మరుగున పడేలా ఉంది.
డెడ్ పూల్ అండ్ వోల్వరిన్(Deadpool and Wolverine) ఇప్పుడు ఈ మూవీనే కల్కి రికార్డుకి ఎసరు పెట్టబోతోంది. హిందీ బెల్ట్ లో కల్కి తొలిరోజు ఏకంగా 22 కోట్ల రూపాయల్ని సాధించింది. పైగా 2024లోనే టాప్ ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఆ స్థానాన్నిడెడ్ పూల్ అందుకోబోతుందని అంటున్నారు.ఎందుకంటే ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్లలో 1.2 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 26 న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం ఉందని, దాంతో కల్కి ని క్రాస్ చేస్తుందని అంటున్నారు.ఇంకో రెండు రోజుల్లో అయితే తేలిపోతుందనుకోండి.
ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మూవీ చూడటం కోసం వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ మూవీస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి డెడ్ పూల్ కి ఉన్న బ్రాండ్ అర్ధమవుతుంది.ఎందుకంటే డెడ్ పూల్ ని నిర్మిస్తుంది ఎవరో కాదు.ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్. ఎవెంజర్స్ సిరీస్, స్పైడర్ మెన్ సిరిస్, ఐరన్ మెన్, థోర్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పంథర్ లాంటి మెస్మరైజ్ చిత్రాలు ఆ సంస్థ నుండి వచ్చాయి. డెడ్ పూల్ లో రేయాన్ రెనాల్డ్స్, హ్యూగ్ జాక్ మెన్, లేసిలీ హుగ్గమాస్ లు ముఖ్య పాత్రల్లో చెయ్యగా షాన్ లీ దర్శకత్వం వహించాడు.రెండు వందల మిలియన్ డాలర్స్ తో నిర్మాణం జరుపుకుంది.