English | Telugu

'స్కంద'గా రామ్.. నేను దిగితే మిగిలేదుండదు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రామ్, బోయపాటి మొదటిసారి చేతులు కలిపిన ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ని ప్రకటించారు.

రామ్, బోయపాటి సినిమాకి 'స్కంద' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుపుతూ తాజాగా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. గ్లింప్స్ లో "మీరు దిగితే ఊడేది ఉండదు.. నేను దిగితే మిగిలేదుండదు" అంటూ రామ్ విశ్వరూపం చూపించాడు. దేవాలయంలో రామ్ కత్తి పట్టుకొని నీటిలో ఫైట్ చేస్తున్న విజువల్స్ బోయపాటి మార్క్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే థమన్ నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. రామ్ ని బోయపాటి నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో చూపించబోతున్నాడని ఈ టైటిల్ గ్లింప్స్ తో మరోసారి స్పష్టమైంది. బోయపాటి సినిమా అంటేనే టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ 'స్కంద' కూడా 'అఖండ' తరహాలో ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా ఉంది.

ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. రామ్ కి, బోయపాటికి ఇదే మొదటి పాన్ ఇండియా ఫిల్మ్. మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.