English | Telugu

బాహుబలి 2015 లో పార్ట్ 1, 2016లో పార్ట్ 2..!

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా భారీ తారాగణంతో డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రేక్షకులను మైమరపించే అద్భుతమైన యుద్ద సన్నివేశాలను తెరకెక్కించారు రాజమౌళి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకి దీటుగా వుంటాయట. ముందుగా చెప్పినట్టే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారట. మొదటి భాగాన్ని 2015వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ సభ్యులు భాగా కష్టపడుతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. అలాగే రెండో భాగాన్ని 2016లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.