English | Telugu

అత్తారింటికి నాగిరెడ్డి పురస్కారం

ప్రతి ఏడాది ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి పేరుతో ఉత్తమ వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలకు పురస్కారాలు అందిస్తున్నారు. 2013వ సంవత్సరానికిగానూ ఈ అవార్డు "అత్తారింటికి దారేది" చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు లభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు అందజేశారు. ఈ అవార్డు కింద రూ.లక్ష యాభై వేలు నగదు బహుమతితో పాటు ఓ జ్ఞాపికను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎస్.జానకి, వి.బి.రాజేంద్రప్రసాద్, వెంకటేష్, శైలజా కిరణ్, తనికెళ్ళ భరణి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.