English | Telugu

హీరోయిన్ కి బ్రెయిన్ సర్జరీ..కండిషన్ సీరియస్..సాయం చెయ్యండి

కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ కేరళలో రోడ్ ప్రమాదానికి గురయ్యింది. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన తమ్ముడు తో కలిసి స్కూటీ మీద వెళ్తుంటే ఒక కారు డీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరకీ తీవ్ర గాయాలయ్యాయి.తాజాగా ఆమె ఆరోగ్యం విషయంలో వస్తున్న ఒక వార్త అభిమానులని ఆందోళనకి గురి చేస్తుంది.

తమిళ చిత్ర రంగానికి చెందిన అరుంధతి నాయర్ ప్రస్తుతం తిరువనంతపురం లోని ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బ్రెయిన్ సర్జరీ చెయ్యడానికి డాక్టర్ లు సిద్ధం అవుతున్నారు. అరుంధతి కుటుంబం ఆర్ధికంగా అంతంత మాత్రమే కావడంతో సాయం కోసం సోషల్ మీడియాలో బ్యాంకు వివరాలని పొందుపరిచారు. సాయం విషయంలో ట్రోల్ చేస్తున్నారని అరుంధతి సోదరి భాదపడుతూ చెప్పింది.

అరుంధతి కి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి తమిళ చిత్ర రంగం నుంచి ఎవరు పరామర్శించలేదనే వార్తలు వస్తున్నాయి. ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్పడిన నడిగర్ సంగం కూడా స్పందించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని మరో నటి అరుందతి స్నేహితురాలైన రెమ్య జోసెఫ్ వెల్లడించింది. వీరుమాన్డీకం శివ నందికం, సైతాన్, కన్ని రాశి, పిస్తా, లాంటి చిత్రాల్లో అరుంధతి నటించింది.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.