English | Telugu

రుద్రమదేవి రాజ్యప్రవేశం ఎప్పుడు?

దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో గుణశేఖర్ సినిమా షూటింగ్ ఉంటుంది....ఒక్కరూపాయి కూడా వెనక్కు తీయకుండా ఖర్చుపెడతాడు. ఆ హంగులు ఆర్భాటాలు చూసి వామ్మో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంచనాలను మించి ఉంటుంది లెండి. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే తప్ప ఓ సినిమా హిట్టుకొట్టదన్నమాట. ఈ కోవకు చెందినవే చూడాలనిఉంది, ఒక్కడు. ఒక్కడు తర్వాత మళ్లీ నాలుగు సినిమాలు ఫ్లాప్. దీంతో రుద్రమదేవిపై భారీ ఆశలు పెట్టుకున్నీడీ దర్శకుడు. కానీ ప్రచారం చూస్తుంటేనే ఎక్కడో తేడా కొడుతోందంటున్నారంతా. సినిమా మొదలెట్టినప్పుడు మేకింగ్ వీడియోతో రచ్చరచ్చ చేశాడు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ బ్రేక్ తీసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులని, బయ్యర్లు రాలేదని ఏవేవో చెప్పాడు. వీటిన్నింటికీ ఫుల్ స్టాప పెడుతూ...బన్నీని రంగంలోకి దించాడు. ట్రైలర్ లాంచ్ చేశాడు. ముద్దుగుమ్మలతో సయ్యాట లాడించాడు. అదిరిపోయే స్థాయిలో ఆడియో రిలీజ్ చేశాడు. ఇంకేముంది బొమ్మ పడుద్ది అనుకుంటే.....మళ్లీ సైలెంటైపోయాడు. మామూలుగా అయితే ఏప్రిల్ 24న రీలజ్ అన్నాడు. కానీ గుణ తీరుచూస్తుంటే సినిమా అనుకున్న రోజు విడుదలయ్యేట్టు కనిపించడం లేదు. దీంతో అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదో? బాహుబలిలా వాయిదా వేసుకున్నాడో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ రుద్రమదేవి రాజ్య ప్రవేశం ఎప్పుడో చూద్దాం!

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.