English | Telugu

ఆంధ్ర, తెలంగాణ నిర్మాతల మధ్య రగడ


ఏపి ఫిలిం చాంబర్‌లో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపి చాంబర్‌లో తెలంగాణ ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాల్సిందే అని ఆ ప్రాంత నిర్మాతలు భీష్మించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలు వేరైనా మాట్లాడే భాష ఒక్కటే అయినప్పుడు వేరే ఏర్పాటు అవసరం లేదని ఆంధ్ర ప్రాంత నిర్మాతలు సూచించారు. ఈ విషయాన్ని ఏ మాత్రం సమ్మతించని తెలంగాణ సినీ సంఘ సభ్యులు చాంబర్ ‌లో దుర్భాషలాడారు. చాంబర్ కు చెందిన బూరుగులపల్లి శివరామకృష్ణ, ఎన్ వి ప్రసాద్ లను తెలంగాణ సభ్యులు తీవ్ర పదజాలంతో దూషించారని సమాచారం. ఈ వివాదంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, అల్లాని శ్రీధర్ ప్రముఖంగా వినవస్తున్నాయి. ఈ రోజు ఏపి ఫిలిం చాంబర్‌లో చోటుచే సుకున్న సంఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.