English | Telugu

అమరన్ థియేటర్ పై పెట్రోల్ బాంబులతో ఉగ్రవాదుల దాడి

శివకార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా ఈ నెల 31 న విడుదలైన మూవీ అమరన్(amaran)పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీని కమల్ హాసన్(kamal haasan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా,రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకుడుగా వ్యవహరించాడు.తమిళనాడుకి చెందిన దివగంత మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కగా విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. 

 రీసెంట్ గా ఈ మూవీని ప్రదరిస్తున్న తమిళనాడు లోని తిరునల్వేలి(tirunalveli)కి చెందిన అలంకార్(alankar)థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్ లతో దాడి చెయ్యడం జరిగింది.స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకి చేరుకునే లోపే దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు.అందుకు సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సిసి కెమెరాలలో రికార్డు అయ్యాయి.దాడిలో అయితే ఎవరకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అమరన్ లో ఒక వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయనే ఆగ్రహంతోనే దాడి జరిగినట్టుగా కొంత మంది చెప్తున్నారు.కానీ పోలీసులు మాత్రం స్థానికంగా ఉన్న గొడవల కారణంగానే జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తదుపరి దర్యాప్తుని ప్రారంభించారు.

 

 థియేటర్ కి అయితే  పోలీసులు భారీ బందోబస్తుని కల్పించారు. కానీ ఎవరు ఊహించని విధంగా దాడి జరగడంతో మూవీ లవర్స్ తో పాటు శివ కార్తికేయన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.