English | Telugu
పుష్ప2 దెబ్బకి రంగంలోకి కమ్యూనిస్టు పార్టీ
Updated : Dec 21, 2024
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె కుమారుడు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు.రీసెంట్ గా ఈ విషయానికి సంబంధించిన పలు విషయాలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలని తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని,బెనిఫిట్ షోలను అనుమతించబోమని తేల్చిచెప్పడం జరిగింది.ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి లాగానే సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని,బెనిఫిట్ షోలను అనుమతించబోమనే ప్రకటన చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.