English | Telugu

ప్రభాస్ పక్కన పొట్టిపిల్లా?

తెలుగులో కిక్కిచ్చే భామలున్నా మనోళ్లు పట్టించుకోరు కానీ...బీ టౌన్లో అంతసీన్ లేదన్న బ్యూటీలపై మాత్రం తెగ మోజుపడుతుంటారు. భారీ పారితోషికం డిమాండ్ చేసినా... ఇచ్చేందుకు సిద్దంగా ఉంటారు. ప్రస్తుతం అలియాభట్ పై కన్నేశాడు ఓ తెలుగు దర్శకుడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో మూవీ తీయనున్న సుజీత్...తన సినిమాలో హీరోయిన్ గా అలియాను సంప్రదిస్తున్నాడట. టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సై అన్న అలియా గతంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం అని... తెలుగులో ఫస్ట్ మూవీ యంగ్ టైగర్ తోనే చేయాలనుందని స్టేట్ మెంట్ ఇచ్చింది. మరి ఆరడుగుల అందగాడి పక్కన ఆఫర్ కి ఒప్పుకుంటుందో వదులుకుంటుందో?. ఆ సంగతి పక్కనపెడితే ప్రభాస్ పక్కన అలియా ఉడతలా కనిపిస్తుంది. అసలు ఈ జోడీయే బాగోదు. అమ్మడి ముఖంలో పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ కూడా ఉండవు. పైగా ఇప్పటి వరకూ ప్రభాస్ తో దాదాపు పొడుగమ్మాయిలే రొమాన్స్ చేశారు. ఇదే ఫైనలైతే.... ఈ జోడీని ప్రేక్షకులు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో డౌటే!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.