English | Telugu
అఖండ 2 కి సంబంధించిన క్రేజీ అప్ డేట్
Updated : Dec 24, 2024
నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna)దర్శకుడు బోయపాటి శ్రీను(boyapati srinu)కాంబోలో తెరకెక్కిన 'అఖండ' మూవీ సాధించిన ఘనవిజయం అందరకి తెలిసిందే.దీంతో కొన్ని రోజుల క్రితం ప్రారంభమయిన 'అఖండ 2 మీద బాలకృష్ణ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.మొదటి భాగంలో అఘోర క్యారక్టర్ లోని బాలయ్య వెళ్తు వెళ్తు నువ్వు నన్ను తలుచుకోగానే మళ్ళీ వస్తానని పాపతో చెప్తాడు. ఈ నేపథ్యంలో అఖండ 2(akhanda 2)కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఉంది.
డిసెంబర్ 11 నుంచే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై ఆచంట రామ్, గోపీచంద్ ఆచంట లు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా తెలుగు చిత్ర సీమకి చెందిన పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.విజయదశమి కానుకగా 2025 సెప్టెంబర్ 25 న మూవీ విడుదల కానుంది.థమన్ సంగీత దర్శకుడు.