English | Telugu

ఆమె నోర్మూయించిన కింగ్

సుశాంత్ హీరోగా నటించిన "అడ్డా" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. అసలే సందిస్తే చాట భారతం చెప్పే ఉదయ భాను... సందు దొరికింది కదా అనుకొని స్టేజ్ పైన హీరో సుశాంత్ డాన్స్ చూసి.. తన మాటలతో పోగిడేసింది.

అయితే ఆ ప్రోగ్రాం కు ముఖ్య అతిదులుగా వచ్చిన నాగార్జున ఆ మాటలు గుర్తు పెట్టుకొని చివర్లో స్టేజ్ మీద ఉదయ భానుని పిలిచి.... "భాను నువ్వు మాస్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చావా? అని అడిగాడు." దాంతో ఏం చెప్పాలో తెలియక అడ్డంగా తలూపింది భాను. "ఆ ఫంక్షన్ లో నేను కూడా ఇలాగె డాన్స్ చేశాను" అని నాగార్జున చెప్పాడంతో అందరు నవ్వినట్లు పేస్ పెట్టారు.

ఇది వినడానికి ఏదో సరదాకి అన్నట్లుగా అనిపించినా కూడా... నాగార్జున తన అసూయ ఏంటో తెలిపినట్లుగా అందరు ఫీల్ అయ్యారు. తనని పొగడకుండా సుశాంత్ ను పొగడటం ఏంటి? అన్నట్లుగా అనిపించింది అక్కడున్నవారందరికి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.