English | Telugu
డ్రీమ్ గర్ల్ హేమ మాలినికి ANR అవార్డ్
Updated : Dec 10, 2011
డ్రీమ్ గర్ల్ కి ANR అవార్డ్ డ్రీమ్ గర్ల్ హేమ మాలినికి ANR అవార్డ్ లభించింది. విషయమేమిటంటే నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు తన పేరిట 2005 లో కోటి రూపాయల మూల ధనంతో స్థాపించిన"అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌందేషన్" ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కరికి ఈ అవార్డుని అందిస్తున్నారు. ముందుగా దేవానంద్ తో మొదలైన ఈ అవార్డులు తర్వాత షబనా అజ్మీ, అంజలీదేవి, వైజయంతి మాల, లతా మంగేష్కర్, కె.బాలచందర్ లను వరించగా, ఈ సంవత్సరం మాత్రం డ్రీమ్ గర్ల్ గా పేరొందిన సీనియర్ హిందీ నటి హేమ మాలినికి ఈ గౌరవం దక్కింది.
డిసెంబర్ 26 వ తేదీ సాయంత్రం, యన్ కవన్వెన్షన్ హాల్లో జరిగే వేడుకలో హేమామాలినీకి అవార్డునందిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రైల్వేమంత్రి దినేష్ త్రివేది, మన ముఖ్యమంత్రి యన్.కిరణ్ కుమార్ రెడ్డి హాజరవనున్నారని సమాచారం.