English | Telugu

మెగా ఫ్యామిలీ తలచుకుంటే అవార్డులు రావా..?


2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులతో పాటు వివిధ అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ అవార్డు ఎంపికలు ఇష్టానుసారం జరిగాయని తమకు కావాలసిన వారికి.. మా అనుకున్న వారికి అవార్డులు కట్టబెట్టారని సోషల్ మీడియాతో పాటు బహిరంగ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని మెగా అభిమానులతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నిర్మాత బన్నీ వాసు కామెంట్ చేశారు. అవార్డులు ప్రకటించిన సంవత్సరాల్లో మెగా హీరోల నుంచి 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అవార్డులు తీసుకోదగ్గ సినిమాలు కానీ.. వ్యక్తులు కానీ లేరా..? ఏదో కంటితుడుపు కోసం చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు.. అల్లు అర్జున్‌కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు.

అంతేనా పైరవీలు చేస్తే అవార్డులు ఇచ్చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. పైరవీలు చేస్తేనే అవార్డులు వచ్చేస్తే మెగా ఫ్యామిలీ ఆ పనిచేయలేదా..? మెగాస్టార్ చిరంజీవికి బాలకృష్ణ ఎంత క్లోజ్ ఫ్రెండో అందరికీ తెలిసింది.. ఇక సీఎం చంద్రబాబుతో బంధం ఈనాటిది కాదు.. వారిద్దరికి చిరు ఒక మాట చెబితే పని అవ్వదా..? అంతేందుకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టీడీపీకి మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత ఆయన తలుచుకుంటే మెగా ఫ్యామిలీకి అవార్డ్ ఇప్పించలేరా.. చంద్రబాబు ఆయన మాట కాదంటారా..? అంటూ సోషల్ మీడియాలో కొందరు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ కౌంటర్‌లు రీ-కౌంటర్‌లతో సోషల్ మీడియా ఉడికిపోతోంది.