English | Telugu

2012 లో రానున్న పెద్ద సినిమాలు

2012 లో రానున్న పెద్ద సినిమాలు ఏమిటంటే చాలానే ఉన్నాయి. రానున్న సంక్రాంతి రేస్ లో దాదాపు ఆరు సినిమాలున్నాయని ఇప్పటి వరకూ అనుకున్నాం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ "అధినాయకుడు", విక్టరీ వెంకటేష్ "బాడీగార్డ్", ప్రిన్స్ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్", రవితేజ "నిప్పు", సునీల్ "పూలరంగడు", యువ రాకింగ్ స్టార్ ఆది "లవ్ లీ" సినిమాలు రేపు రాబోయే సంక్రాంతి పండుగకు విడుదలవుతాయని వినపడింది. కానీ వీటిలో "బాడీ గార్డ్, బిజినెస్ మ్యాన్, పూలరంగడు" మాత్రమే సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి.

" అధినాయకుడు, నిప్పు , లవ్ లీ" సినిమాలు ఫిబ్రవరికి వాయిదాపడ్డాయి. ఇవికాక ఇంకా రాబోయే పెద్ద సినిమాలు ఏమిటంటే కింగ్ అక్కినేని నాగార్జున "డమరుకం", పవర్ స్టార్ "గబ్బర్ సింగ్", యంగ్ టైగర్ యన్.టి.ఆర్. "దమ్ము", యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "రెబెల్", మెగాపవర్ స్టార్ "రచ్చ", యువసామ్రాట్ "ఆటోనగర్ సూర్య" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "హనీ" మార్చ్, ఏప్రెల్ నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. యువ హీరోలు యన్.టి.ఆర్., రామ్ చరణ్, వరస సినిమాలు చేస్తున్నారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్.టి.ఆర్. హీరోగా నటించే సినిమా కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతుంది. అలాగే రామ్ చరణ్ కూడా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒకటి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "ఎవడు" చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతాయి. సో 2012 లో అందరు పెద్ద హీరోలూ బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తూంటే మన సినీ పరిశ్రమ కళకళలాడుతుందనటంలో సందేహం అక్కర్లేదు. అలాగే ప్రేక్షకులకు కూడా విందు భోజనం లాంటి సినిమాలు కనువిందుచేయనున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.