Read more!

English | Telugu

సినిమా పేరు: త్రీ
బ్యానర్:రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 17, 2008
నిషా అనే అమ్మాయికి ఎవరో శంకర్‌ అనే వ్యక్తకి "'నిన్ను చంపుతా" అని బెదిరిస్తూ ఉంటాడు. అయితే అతని రూపం కనపడకుండా, ఒక్క గాత్రమే ఆమెకు భయపడుతూ వుంటుంది. ఆ గాత్రంతో పాటు ఇంకా గ్లాసుపగిలిన శబ్దం, కారు స్టార్ట్‌ అయిన శబ్దం కూడా ఆమెకు వినపడుతూ వుండటంతో, ఆమె భయపడుతుంది. ఆమె పక్కనే ఉంటున్న రిషికి తన సమస్యను చెపుతుంది. దాంతో రిషి తనకు తెలిసిన సైక్రియాటస్ట్‌ (హర్షవర్ధన్‌) సాయం తీసుకుంటాడు. అతని సాయం వల్ల నిషా తాను గతంలో ఒక ద్వీపానికి వెళ్ళాననీ, అక్కడ శంకర్‌ అనే గైడ్‌తో పరిచయం అయ్యిందనీ చెపుతుంది. ఈ విషయమేదో తేలుద్దామని రిషి, సైక్రియాటిస్ట్‌, నిషాతో కలసి ఆ ద్విపానికి వెళతారు. ఆ తర్వాతేమయిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇదొక థ్రిలర్‌ చత్రంలూ తీయాలని ఈ చిత్రం యూనిట్ ప్రయత్నించింది. కానీ థ్రిల్ లేకపోగా ఇది 'డల్‌గా" తయారయింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఈ చిత్రంలో భయపడే సీన్‌ కనీసం ఒక్కటి కూడా లేకపోవటం, థ్రిల్లర్ చిత్రాలను ఈ సినిమా మనల్ని ఎంతగా భపయపెడుతుందన్న ఎగ్జయిట్‌మెంట్‌ కోసమే జనం చూస్తారు. ఇందులో పునర్జన్మల కాన్సెప్ట్‌ ఒకటుంది. అదీ ఏ ఒక్కరికో గత జన్మ స్మృతులు గుర్తుకురావటం కాకుండా ఈ చిత్రంలో నటించిన నలుగురికీ గుర్తుకు రావటం, ఆ నలుగురూ మళ్ళీ ఈ జన్మలో ఒకరికి ఒకరు తెలియటం చూస్తే, అలాంటి తిక్క కథను ఎన్నుకొన్న ఈ దర్శకుణ్ణి ఏమనాలో అర్థం కాదు. అలాంటి కథతో చిత్రాన్ని నిర్మించటానికి సాహసించిన ఈ చిత్ర నిర్మాతలను తప్పకుండా అభినందించాలి. నిషా గత జన్మలో ఆమె భర్త రాజీవ్‌ కనకాల, అతని స్నేహితుడు రిషి, ఆమె ప్రియుడు శాంతిచంద్ర. ఈ నలుగురే ఈ చిత్రంలో ప్రథాన పాత్రలు. నిషాకి చంపుతానని బెదిరించిన వ్యక్తి మాటలే ఆమెకు వినిపించటం, చంపిన వాడు గుర్తుకు రాకపోవటం విచిత్రం. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాలను ముందు అత్మగా అంటే దెయ్యంగా చూపిస్తాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత అతను మామూలు మనిషిగా కనపడతాడు. ఇంతకీ అతను ఆత్మో, మనిషో ప్రేక్షకులకు అర్థం కావటం కొంచెం కష్టమే. ఈ సినిమా ఏ స్థితిలోనూ, ఏ విధంగానూ ప్రేక్షకులను ఆకట్టుకోదు సరికదా కొని చోట్ల విసుగుపుట్టిస్తుంది. ఈ ఇత్రం మొదట్లో రిషిని నేషనల్‌ జియోగ్రాఫిక్ ఛానల్ రిపోర్టర్‌గా చూపించటం ఎందుకో అర్థం కాదు. దానివల్ల ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు, కనీసం ప్రయోజనం కూడా లేదు. ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు 'ఎ ఫిల్మ్‌ బై ఆరవింద్‌"ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాడు. చివరికి జనాన్ని ప్పించటానికి 'బోర్న్‌ ఎగైన్‌ అనే ఏదో ఇంగ్లీష్‌ పుస్తకం, ఆన్లోని ఫొటోలు చూపించటం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఈ చిత్రంలో సాంకేతిక వర్గానికొస్తే కెమెరా పనితనం చాలా చక్కగా వుంది. లైటింగ్‌ స్కీము అదీ కాస్త కొత్తగా ఆసక్తిగా వుంది. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది. అలాగే ఎడిటింగ్, ఆర్ట్‌ డైరెక్షన్‌ కూడా బాగున్నాయి. ఇలాంటి టెక్నికల్‌ టీమ్‌ని ఉంచుకుని కథ విసయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల చిత్రం ప్రేక్షకులకు ఆసక్తికలిగించదు. ఇక నటన విషయానికొస్తే రాజీవ్‌ కనకాల మామూలుగా తనవంతు పాత్రని తాను కృషిలోపం లేకుండా చక్కగా నటించాడు. రిషి కూడా ఫరవాలేదు. శాంతి చంద్రకోపరంగా చూడటమే నటననుకుంటునట్టున్నాడు. ఊర్శశి శర్మ నటన ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకోదు. ఇక రంగనాథ్‌, విజయచందర్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
డబ్బు పెట్టి టిక్కెట్టు కొనే ప్రేక్షకుడికి సినిమా బాగుందా..? అదే...? అన్నదే ముఖ్యం కానీ, దర్శకుడికి ఎంత నాలెడ్జి వుంది, టెక్నికల్‌గా ఎంత గొప్ప స్థాయిలో ఉందన్నది ముఖ్యం కాదు కదా. ఎనీవే ఈ చిత్రం ఫెయిలయితే దానికి కారణం ఒక్క దర్శకుడిదే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చూడతగ్గ గొప్ప చిత్రమేం కాదు.