Read more!

English | Telugu

సినిమా పేరు:రోబో
బ్యానర్:శ్రీ కృష్ణా ట్రేడర్స్, సన్ పిక్చర్స్
Rating:3.50
విడుదలయిన తేది:Oct 1, 2010
వశీ మోహన్(రజనీకాంత్) అంకితభావమున్న ఒక సైంటిస్ట్.అతను పదేళ్ళు కష్టపడి చిట్టి అనే ఒక రోబోని తయారుచేస్తాడు.దాన్ని ప్రభుత్వ అనుమతి కోసం తీసుకెళితే అక్కడ వశీ మోహన్ గురువు బోరా(డేనీ) ఆ కమిటీలో ఉండి అతని రోబోకి అనుమతి రాకుండా చేస్తాడు.ఎందుకంటే వశీ మోహన్ తయారుచేసిన రోబోని పర్మింగర్ అనే ఏజెంట్‍ ద్వారా బోరా టెర్రరిస్టులకు అమ్మాలనే ఉద్దేశంతో ఉంటాడు.ఒక అగ్ని ప్రమాదంలో రోబో చాలా మందిని కాపాడుతుంది.ఆ అగ్ని ప్రమాదంలో స్నానం చేస్తూ ఇరుక్కుపోయిన గౌరీ అనే ఒకమ్మాయిని అలాగే బట్టలు లేకుండానే తీసుకొస్తుంది.దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది.అందుకని వశీ మోహన్ తో "ఇది యంత్రం. దీనికి మానవ స్పందనలేమీ తెలియవు."అన్న కారణంతో రోబోకి ప్రభుత్వ అనుమతి లభించదనీ,దాన్ని తనకు ఇచ్చేయమనీ అంటాడు బోరా.చాలా కష్టపడి రోబోకి మానవ స్పందనలు అంటే కోపం,ఆవేశం,ఉత్సాహం, ఆనందం వంటివాటని ఏర్పాటుచేస్తాడు సైంటిస్ట్.అప్పుడు సైంటిస్ట్ ప్రేమిస్తున్నసన(ఐశ్వర్యారాయ్)ను రోబో కూడా ప్రేమించటం మొదలు పెడతాడు.మిలటరీకి రోబో పనితనం చూపిద్దామనుకున్న సైంటిస్ట్ అక్కడ ప్రేమ పాఠాలు చెప్పిన రోబో వల్ల అవమానం పాలవుతాడు.సైంటిస్ట్ రోబోని నాశనం చేసి చెత్త కుప్పలో పడేస్తాడు.ఈ విషయం తెలుసుకున్నబోరా చెత్తలో ఉన్న రోబోని తెచ్చి దాన్ని బాగుచేసి దానికి "రెడ్ చిప్" తగిలిస్తాడు. దాంతో సైంటిస్ట్ సన ను వివాహం చేసుకుంటున్నకళ్యానమంటపానికి వచ్చి సైంటిస్ట్ ని కొట్టి సన ని కిడ్నాప్ చేస్తాడు రోబో.అంతే కాక తనలాంటి మరో వందమంది రోబోలను తయారుచేస్తాడు చిట్టి.అడ్డు వచ్చిన బోరాని చంపేస్తాడు.తనకు ఒక డెన్ లాంటిది ఏర్పాటు చేసుకుని సనని "నన్ను ప్రేమించు" అంటూ విసిగిస్తాడు.అప్పుడు సైంటిస్ట్ ఏంచేశాడు...? ఎలా చిట్టిని అదుపు చేశాడన్నది మిగిలిన కథ...!
ఎనాలసిస్ :
దర్శకత్వం - దర్శకుడు శంకర్ తన తొలి చిత్రం నుంచీ ఈ తొమ్మిదవ చిత్రం"రోబో" వరకూ తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని చర్చిస్తూంటాడు.అలాగే ఈ సినిమాలో టెక్నాలజీని మానవ సంబంధాలకు ముడిపెడితే వచ్చే పరిణామాలెలా ఉంటాయో అన్న విషయం గురించి చర్చించాదు శంకర్.నిజానికి శంకర్ ఇండియన్ సినిమాకి దొరికిన ఒక వజ్రం అని చెప్పాలి."రోబో" చిత్రం సాంకేతికంగా ఏ హాలీవుడ్ చిత్రానికీ తీసిపోదని గర్వంగా చెప్పవచ్చు.శంకర్ ఈ చిత్రానికి ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ అమోఘం.అది ఒక రోబో మనిషికి పురుడు పోయటం.ఈ చిత్రం క్లైమాక్స్ లో రోబో ఇచ్చే సందేశం అద్భుతం"ఒక రెడ్ చిప్ వల్ల నేను పొల్యుట్ అయ్యాను.కానీ మనుషులు ఈర్ష్య, అసూయ, వంచన, మోసం, ద్రోహం ఇలా అనేకమైన రెడ్ చిప్స్ తో తిరుగుతున్నారు.ఇంకా నయం నేను మనిషిగా పుట్టలేదు" అంటాడు.ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా జాగ్రత్తగా శంకర్ డిజైన్ చేశాడు.అతని ఊహలకు దృశ్యరూపమివ్వటానికి మన దేశంలో ఏ దర్శకుడూ చేయని సాహసం చేశాడు శంకర్.హేట్సాఫ్ టు హిజ్ గట్స్.హాలీవుడ్ చిత్రం "అవతార్"లో వాడిన టెక్నాలజీని వాడి, 1500 కంప్యూటర్ గ్రాఫిక్ షాట్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం 150 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో 2250 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలయ్యింది.దీన్ని బట్టి ఈ సినిమా రేంజ్ ని మనం అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమాకి ఖర్చుపెట్టిన ప్రతి పైసా మీకు సెల్యులాయిడ్ మీద కనపడుతుంది.ఫస్ట్ హాఫ్ ఉన్నంత బాగా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే ఈ చిత్రం కచ్చితంగా చరిత్ర సృష్టించేది.అయినా ఈ సినిమా సూపర్ హిట్టనటంలో సందేహం లేదు. నటన - పొల్యుటైపోయిన రోబో గా రజనీకాంత్ నటనకూ, సైంటిస్ట్ రజనీకాంత్ నటనకీ పోంతన ఉండదు.అసలు రజనీ కాంత్ నటన గురించి ఈ రోజు నేను కొత్తగా ఏం రాయక్కరలేదు.గత 30 యేళ్ళుగా ఆయనేంటో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక ఐశ్వర్యారాయ్ గొప్పగా నటించటానికేం లేదు.అయినా ఆమె తన పాత్రకు తాను న్యాయం చేసింది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - రెహమాన్ సంగీతంలో వచ్చిన పాటలన్నీ బయటకన్నా సినిమాలో బాగున్నాయి.రీ-రికార్డింగ్‍ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ - ఎక్స్ ట్రార్డినరీ కేమెరా వర్క్. ఇంతకంటే రత్నవేలు గురించి ఏం రాయక్కరలేదు.ఈ మాటమీద మీకేమన్నా డౌటుంటే "రోబో" సినిమా చూడండి. ఎడిటింగ్ - ఇది కూడా అంతే ట్రెమండస్ జాబ్‍ డన్ బై మిస్టర్ ఆంథోనీ. మాటలు - బాగున్నాయి.డబ్బింగ్ సినిమాలోని మాటల్లా ఈ చిత్రంలోని మాటలనిపించవు. పాటలు - సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా పాటలన్నీ బాగున్నాయి. ఆర్ట్ - చాలా బాగుంది. కొరియో గ్రఫీ - ఈ చిత్రంలో ఒక పాటతో మరొక పాట కొరియోగ్రఫోఫీలో పోటీపడింది. యాక్షన్ - స్కై ఈజ్ ద లిమిట్. అంతే చెప్పగలం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీ.ఈ సినిమా గురించి ఇంతకంటే చెప్పేదేమీ లేదు.