Read more!

English | Telugu

సినిమా పేరు:మహాత్మ
బ్యానర్:గోల్డెన్ లయన్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 9, 2009
దాస్ (శ్రీకాంత్) అనే గూండా గాంధీ బొమ్మ సెంటర్ లో రౌడీయిజం చేస్తుంటాడు. అతను తనకు నచ్చిన పని చేసుకుంటూపోతుంటాడు. అది అవతలి వాళ్ళకు బాధ కలిగించేదైనా సరే దానికతడు ఏమాత్రం వెనుకాడడు. ఒక స్థలం కబ్జా చేసిన వాళ్ళని ఆ స్థలంలోనుండి ఖాళీ చేయించటానికి రెండు లక్షలు డబ్బు తీసుకుంటాడు దాస్. ఫ్యాబ్ సిటీ నిర్మించేందుకు మినిస్టర్ కళారాణి నిరుపేదల భూములను యస్.ఇ.జెడ్ పేరిట ఆక్రమించి భూమి పూజ మొదలుపెడుతుంది. దాన్ని దాదా తన మనుషులతో వచ్చి అడ్డుకుంటాడు. ఎందుకంటే కళారాణి నుండి రెండు వందల కోట్లు ఆశిస్తుంటాడు దాదా. దాదా కోసం ఆ ఫ్యాబ్ సిటీ భూమిలో పట్టా భూముల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్న ఠాగూర్ అనే ఒక వ్యక్తిని దారుణంగా కాళ్ళు విరిగేలా కొట్టి, వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న టెంట్‍ని పీకిపారేస్తాడు దాస్. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి కృష్ణవేణి అనే ఒక లాయర్ పరిచయమవుతుంది.ఆమె ద్వారా గాంధీ ఎవరు...? ఆయన సిద్ధాంతం ఏమిటి...? ఆయన ఆదర్శాలేమిటి..? ఆయన మనకు ఏ విధంగా స్వాతంత్ర్యం తీసుకొచ్చారు....? వంటి వివరాలన్నీ గూండా దాస్ తెలుసుకుంటాడు. తన కళ్ళ ముందు రకరకాల మన పాతతరం నాయకుల వేషాలతో తిరిగే బళ్ళారి అనే వీధి నాటకాలాడే వ్యక్తి (రామ్ జగన్) చనిపోతున్నప్పుడు, గాంధీ గురించి అతను చెప్పిన మాటలు దాస్ లో పెనుమార్పును తీసుకు వస్తాయి.గాంధీ అంటే ఒక నిజమనీ, గాంధీ అంటే ఒక సిద్ధాంతమనీ, గాంధీ అంటే ఒక మతమనీ, గాంధీ అంటే ఒక ఆదర్శమనీ, అదే గాంధీయిజమనీ, రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పునాదులతో పెకలించిన మహాశక్తి గాంధీ అనీ, మన దేశానికి బానిస సంకెళ్ళు తెంచి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు గాంధీ అనీ, అందుకే ఆయన జాతిపిత అయ్యారనీ తెలుసుకుంటడు దాస్.అలా తెలుసుకున్న తర్వాత దాస్ మారిపోతాడు. అలా మారే క్రమంలో దాస్ చాలా ఘర్షణకు లోనవుతాడు. ఆ క్షణం నుండీ అసలు సిసలైన గాంధీ గారి శిష్యుడవుతాడు దాస్. అతను ఏ సెంటర్ లో అయితే దాదా గిరీ చేశాడో, అదే సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం మీద కప్పి ఉన్న ఒక రాజకీయ పార్టీ జండాని తీయటానికి ప్రయత్నిస్తే ఆ పార్టీ వాళ్ళు వచ్చి దాస్ ని కొడతారు. అయినా వాళ్ళు తననెంతగా హింసించినా, కాళ్ళు చేతులు విరుగుతున్నా, తల పగిలి నెత్తురు కారుతున్నా లెక్కచేయకుండా, వాళ్ళని పన్నెత్తి మాటనకుండా, చెయెత్తి ఒక దెబ్బ కొట్టకుండా మౌనంగా భరించి, సహించి గాంధీ బొమ్మ మీద కప్పిన ఆ రాజకీయ పార్టీ జండాని తొలగించి బాపూ విగ్రహానికి పాలాభిషేకం చేస్తాడు దాస్.దాంతో అప్పటి వరకూ ఒక గూండాగా అతనికున్న ఇమేజ్ పోయి గాంధీ సిద్ధాంతాలను అనుసరించే వాడిగా జనంలో అతనికి మంచి పేరొస్తుంది.తరవాత తాను ఠాగూర్ ని కొట్టటం వల్లే ఠాగూర్ కొడుకు హోటల్లో పనిచేస్తూ చదువుకుంటున్నాడని తెలిసి, అతనింటికి వెళ్ళి "నన్ను క్షమించండి"అన్న కార్డు బోర్డు పట్టుకుని నిలబడతాడు దాస్. చిన్న పిల్లవాడైన ఠాగూర్ కొడుకు, అతని స్నేహితులు రాళ్ళతో కొట్టినా మౌనంగా భరిస్తాడు. అలా ఠాగూర్ మనసు గెలుచుకుంటాడు దాస్. ఒకప్పుడు ఠాగూర్‌ ఏ ఇళ్ళ పట్టాల కోసం ఒకప్పుడు పోరాడాడో ఆ ఇళ్ళ పట్టాలు సాధించటానికి దాస్ కూడా నడుం బిగిస్తాడు. ఆ స్థలంలో వెయ్యి కోట్ల ఖర్చుతో ఫ్యాబ్ సిటీ నిర్మించటానికి కళారాణి(జ్యోతి) అనే ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమెకు రాజకీయ గూండా అయిన దాదా(జయప్రకాష్ రెడ్డి)కీ పడదు. వీళ్ళిద్దరికీ వాళ్ళ పార్టీ పెద్ద మనిషి (ఆహుతి ప్రసాద్) రాజీ చేస్తాడు. కానీ దాస్ అదే స్థలంలో నిరాహార దీక్ష చేస్తుంటాడు. అతన్ని, అతన్ని అనుసరిస్తున్న జనాన్ని అక్కణ్ణించి ఖాళీ చేయించటానికి పోలీసులను పంపుతాడు పార్టీ పెద్దమనిషి. కానీ అక్కడ దాస్ తన మీద తాను పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి సిద్ధపడటంతో, పోలీసులు అక్కణ్ణించి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాస్ ని హాస్పిటల్లో చేర్పిస్తారు. దాస్ ని చూసేందుకు నగరంలోని అన్ని బస్తీల నుండి జనం తండోపతండాలుగా హాస్పిటల్ కి తరలివస్తారు. జనంలో దాస్ కున్న పలుకుబడి చూసిన పార్టీ పెద్ద మనిషి దాస్ ని లొంగదీసుకోటానికి చాలా ఆశలు చూపిస్తాడు. కానీ దాస్ అవేవీ తనకు వద్దనీ, జనానికి ఇళ్ళ పట్టాలిమ్మంటాడు. అలాగే అనుకున్నది గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో సాదిస్తాడు దాస్.దాస్ ఎన్నికల్లో నిలబడటానికి నామినేషన్ వేయటానికి వెళ్ళేటప్పుడు, కళారాణి వద్ద పది లక్షలు తీసుకున్న దాస్ అనుచరుడయిన ఒక ముస్లిం(ఉత్తేజ్‍‍), దాస్ కి విషం కలిపిన పాయసాన్ని తాగమని ఇస్తాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న డబ్బుని ఆ ముస్లిం అనుచరుడికిచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకమంటాడు దాస్. అది చూసిన ఆ అనుచరుడికి పశ్చాత్తాపం కలిగి చేసిన పాపం చెపుతాడు. ఆ తర్వాత ఏమయింది..? దాస్ బ్రతికాడా.? ఎన్నికల్లో నిలబడ్డాడా...లేదా? గాంధీ గారి సిద్ధామతాలను దాస్ ఆచరించాడా...? చివరికి అతను జాతి పుత్రుడిగా ఎలా మారాడు....? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే.
ఎనాలసిస్ :
ఈ చిత్రంలోని దర్శకత్వం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనేంటో, ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో ఆయన గత చిత్రాలే మనకు చెపుతాయి.మనకున్న అతి కొద్దిమంది మంచి దర్శకులలో కృష్ణవంశీ ఒకరనే విషయం ఈ చిత్రంతో మరోసారి రుజువయ్యింది.ఈ కమర్షియల్‍ యుగంలో, మానవత్వం నశిస్తూన్న ఈ ఉగ్రవాద, మత మౌఢ్యాల కాలంలో, మాహాత్మా గాంధీ గురించి, ఆయన సిద్ధాంతాల గురించి సినిమా తీయాలనుకోవటమే సాహసం. ఈ చిత్రంలో కృష్ణవంశీ ఏ రాజకీయ పార్టీని వదల్లేదు. అలాగే సినిమాల్లో వేషాలేయాలమటే హీరో కావాలంటే ఎలాంటి అర్హతలుండాలో, రాజకీయాల్లో యమ్.యల్.ఎ.అవ్వాలంటే ఏమేం చేయాలో, అందుకేలామటి అర్హతలుండాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు, చెప్పించాడు కృష్ణవంశీ .ఇలా ఒకటా, రెండా ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించీ రాయాల్సిందే. అందునా "నా వందవ చిత్రానికి నువ్వే దర్శకత్వం వహించి, అది నాకొక మధుర జ్ఞాపకంగా ఉండాలి, నా సినీ జీవితంలో అదోక మైలు రాయిలా ఉండిపోవాలి"అని శ్రీకాంత్ లాంటి ఒక మంచి స్నేహితుడడిగిన దానికి ఈ చిత్రంలో తనను తాను తగ్గించుకుని, శ్రీకాంత్ కి ఒక అద్భుతమైన కానుకగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అందించాడు కృష్ణవంశీ. నిజానికి ఇది ఒక్క శ్రీకాంత్ కే కానుక కాదు మనందరికీ కానుకని చెప్పాలి.మామూలుగా కృష్ణవంశీ సినిమాలో స్టార్లు కనపడరు. పాత్రలే కనపడతాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా ప్రతి ఫ్రేములో కృష్ణవంశీనే కనపడతాడు.అంటే దర్శకుడి ప్రతిభే కనపడుతుంది.కాని ఈ చిత్రంలో మనకు కృష్ణవంశీ శైలి కనపడుతుంది కానీ కృష్ణవంశీ కనపడడు.ఒక్క శ్రీకాంతే కనపడతాడు. అందుకే కృష్ణవంశీ తనని తాను తగ్గించుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని రాసింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇలా ఒకటా, రెండా ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించీ రాయాల్సిందే. అందునా "నా వందవ చిత్రానికి నువ్వే దర్శకత్వం వహించి, అది నాకొక మధుర జ్ఞాపకంగా ఉండాలి, నా సినీ జీవితంలో అదోక మైలు రాయిలా ఉండిపోవాలి"అని శ్రీకాంత్ లాంటి ఒక మంచి స్నేహితుడడిగిన దానికి ఈ చిత్రంలో తనను తాను తగ్గించుకుని, శ్రీకాంత్ కి ఒక అద్భుతమైన కానుకగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అందించాడు కృష్ణవంశీ. నిజానికి ఇది ఒక్క శ్రీకాంత్ కే కానుక కాదు మనందరికీ కానుకని చెప్పాలి.మామూలుగా కృష్ణవంశీ సినిమాలో స్టార్లు కనపడరు. పాత్రలే కనపడతాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా ప్రతి ఫ్రేములో కృష్ణవంశీనే కనపడతాడు.అంటే దర్శకుడి ప్రతిభే కనపడుతుంది.కాని ఈ చిత్రంలో మనకు కృష్ణవంశీ శైలి కనపడుతుంది కానీ కృష్ణవంశీ కనపడడు.ఒక్క శ్రీకాంతే కనపడతాడు. అందుకే కృష్ణవంశీ తనని తాను తగ్గించుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని రాసింది. ఇలా ఒకటా, రెండా ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించీ రాయాల్సిందే. అందునా "నా వందవ చిత్రానికి నువ్వే దర్శకత్వం వహించి, అది నాకొక మధుర జ్ఞాపకంగా ఉండాలి, నా సినీ జీవితంలో అదోక మైలు రాయిలా ఉండిపోవాలి"అని శ్రీకాంత్ లాంటి ఒక మంచి స్నేహితుడడిగిన దానికి ఈ చిత్రంలో తనను తాను తగ్గించుకుని, శ్రీకాంత్ కి ఒక అద్భుతమైన కానుకగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అందించాడు కృష్ణవంశీ. నిజానికి ఇది ఒక్క శ్రీకాంత్ కే కానుక కాదు మనందరికీ కానుకని చెప్పాలి.మామూలుగా కృష్ణవంశీ సినిమాలో స్టార్లు కనపడరు. పాత్రలే కనపడతాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా ప్రతి ఫ్రేములో కృష్ణవంశీనే కనపడతాడు.అంటే దర్శకుడి ప్రతిభే కనపడుతుంది.కాని ఈ చిత్రంలో మనకు కృష్ణవంశీ శైలి కనపడుతుంది కానీ కృష్ణవంశీ కనపడడు.ఒక్క శ్రీకాంతే కనపడతాడు. అందుకే కృష్ణవంశీ తనని తాను తగ్గించుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని రాసింది. పాటలు-: ఈ చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా సిరివెన్నెల వ్రాసిన "ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ - ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ"జనాన్ని మరోసారి గాంధీ గురించి ఆలోచించేలా జేస్తుంది.గాంధీ గురించీ, గాంధీయిజం గురించీ ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ రాయలేని విధంగా ఉందీ పాట. ఈ పాట సినిమాలో చూస్తున్నప్పుడు దేశభక్తి ఉన్న ఎవరికైనా,మనసుండి మంచికి స్పందించే మనసున్న ఎవరికైనా కంటి వెంట నీళ్ళు రాక మానవు. ఇక లక్ష్మీ భూపాల్ వ్రాసిన పక్కా మాస్ సాంగ్ "జజ్జనక జజ్జనక" అనే పాటలో సాహిత్యం జాగ్రత్తగా వింటే నేటి మన సామాజిక పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు పాటలో వినిపించారు లక్ష్మీ భూపాల్. రానున్న కాలంలో సందేహం లేకుండా ఆంధ్రా అంతటా మారుమోగుతుంది.ఛార్మి చేసిన స్పెషల్ సాంగ్ లోనూ, "నీలపురి నీలవేణి" పాటలో కూడా విజువల్ ఫీస్ట్ లా అందరినీ అలరిస్తుంది. కొరియోగ్రఫీ-: అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ పోటీ పడింది.ఈ సినిమాకి అందించిన కొరియోగ్రఫీ విషయంలో ఒక పాటని మించి ఒక పాట బాగుంది. యాక్షన్-: అన్ని యాక్షన్ సీన్లూ సహజంగా ఉండి బాగున్నాయి. ప్రస్తుతం మన నాగరికత ముసుగేసుకున్న ఆటవిక జీవన విధానంలో, జంతు ప్రవృత్తితో జీవిస్తున్న మనం, మన జాతిపిత మహాత్మాగాంధిని సరిగ్గా గౌరవిస్తున్నామా...? అక్టోబర్ రెండున గాంధీ జన్మదినం నాడు మాంసం, మందు దొరకని డ్రైడేగా భావించే నేటి సమాజం, ఆయన సిద్ధాంతాలను ఎంతవరకు అర్ధం చేసుకుని, ఆచరించి, ఆయన్ని అనుసరించగలుగుతున్నాము...? నిజానికి మనిషిలోని మృగత్వం నుండి మనిషి మనిషిగా మారటానికి చేసే ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా ఒక్క తెలుగువారే కాదు ప్రతి భారతీయుడూ, ఇంకా ఎక్కువగా చెపితే ప్రతి మనిషీ చూడాలి. ముఖ్యంగా నోబుల్‌ శాంతి బహుమతి పొందిన, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకే స్ఫూర్తి దాత అయిన మన జాతిపిత మహాత్మాగాంధీ అంటే తెలియని నేటితరం, ఆయన గొప్పతనాన్ని కొద్దో గొప్పో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని తప్పకుండా చూసి తీరాలి.